జయహో ఇండియన్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: September 2, 2021   |   Posted By:

జయహో ఇండియన్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు. నాయకులా? అమాయకులా? దేశమా? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి..

టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
లిరిక్స్: కాసర్ల శ్యామ్
ఆర్ట్: మోహన్, మగేశ్వర రావు