జిప్సి మూవీ రివ్యూ

Published On: July 17, 2020   |   Posted By:

జిప్సి మూవీ రివ్యూ

సందేశాల లస్సీ: జీవా ‘జిప్సి’ రివ్యూ

Rating:2.5/5

చారిత్రక సామాజిక కారణాల వల్ల క్రీ.శ.400ల నుండి క్రీ.శ.1200ల మధ్య కాలంలో భారతీయ కళాకారులు ముస్లిం దేశాలకు వలస వెళ్లారు. ఎక్కువగా రాజస్థాన్‌ నుంచి వెళ్లిన వారే. వారినే ఇంగ్లీష్‌ వారు జిప్సీలు అన్నారు. ఆ తర్వాత కాలంలో సంచార జీవులుగా తిరిగే జాతిని జిప్సీలు అనటం మొదలెట్టారు. జిప్సీలు జీవన విధానం పై ఇతర దేశాల్లో పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. కానీ మనకు మాత్రం అతి తక్కువ. ఇప్పుడు జిప్సీ అనే టైటిల్ తో తమిళ హీరో జీవాని ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా ఆవిష్కరించారు నేషనల్ అవార్డ్ డైరక్టర్ రాజ్ మురగన్. ఈ సినిమాలో జిప్సీల జీవన విధానాన్ని ఏమన్నా స్పృశించారా…కథేంటి…చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

జిప్సీ (జీవా) చిన్నప్పుడే ఓ బాటసారితో జీవితం మొదలెట్టాల్సిన పరిస్దితి వస్తుంది. అక్కడ నుంచి ఆ బాటసారితో అన్ని ప్రాంతాలకు తిరుగుతూంటాడు. వెళ్లిన చోటల్లా పాటలు పాడుతూ..ప్రకృతిని ఆశ్వాదిస్తూ….జీవించంటం వీరి నైజం. అలా తిరుగుతూ పెరిగిన జిప్సీ…ఓ వయస్సు వచ్చాక వహీదా(నటాషా సింగ్)తో ప్రేమలో పడతాడు. సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె కూడా మన జిప్సీ కు మనసు ఇచ్చేస్తుంది. ఈలోగా ఆమె ఇంట్లో వాళ్లు సంభంధం ఒటకి సెట్ చేస్తారు. దాంతో ఈ ప్రేమికులిద్దరూ ఎవరూ లేని ఏకాంతానికి పారిపోతారు. జిప్సీ ఓ ఫ్యామిలీమెన్ గా జీవితం ప్రారంభిస్తాడు. ఈ లోగా ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో విధి పగపడుతుంది. హిందూ..ముస్లిం గొడవలు మొదలవుతాయి. వాటినుంచి తప్పించుకునే క్రమంలో వీళ్లిద్దరూ దూరమవుతారు. ఆమె బాగా డిస్ట్రబ్ అవుతుంది. దాంతో సంవత్సరం గడిచినా ఆ విషాద జ్ఞాపకాల్లోనే ఉంటుంది. ఇవేమీ పట్టించుకోని తండ్రి ఆమెకు విడాకులు ఇప్పిద్దామని ట్రై చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జిప్సీ ఏం చేసాడు. తన భార్యను, బిడ్డను తిరిగి తన దగ్గరకు తెచ్చుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

తమిళంలో ఆ మధ్య వచ్చిన జోకర్ అనే చిన్న సినిమా పెద్ద సెన్సేషన్. ఆ దర్శకుడు చిత్రం కావటంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. తమిళంలో మార్చిలోనే రిలీజైన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇంతకాలానికి ఓటీటిలో రిలీజైంది. అయితే జోకర్ ఫార్మెట్ లోనే ఓ సామాజిక సందేశానికి కొంత అధివాస్తవికత కలిపి చెప్పాలన్న దర్శకుడు ప్రయత్నం మాత్రం పూర్తి స్దాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ని మెజేస్ ముంచేసింది. దర్శకుడు దాదాపు ప్రతి ఐదు నిముషాలకు ఏదో ఒక థీరి చెప్దామనే ప్రయత్నం..పంటి కింద రాయిలా మన బుర్రకు తగులుతుంది.దానికి ఇలాంటి కథ మనకు మణిరత్నం బొంబాయి, కమల్ …హే రామ్ లోనూ కనపడుతుంది. అయితే వాళ్లు దాన్ని ఓ తాము చెప్పాలనుకున్న జానర్ కు కట్టుబడి చెప్పారు. ఇక్కడ అదే కొరవడింది. జిప్సీగా జీవా వంటి హీరోని తీసుకున్నా…అతను చేయటానికి కథలో స్కోప్ లేదు. విధి ఆడిన నాటకంలో ఓడి,గెలిచే పాత్ర అది. పూర్తిగా డైరక్టర్ ఓరియెంట్ ఫిల్మ్. గతంలో తను జర్నలిస్ట్ గా చేసినప్పటి అనుభవాలకు తనకు తెలిసిన లేదా తను నమ్మిన విషయాలను కలిపి తెరకెక్కించటానికి ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నాడని అర్దమవుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ స్క్రీన్ ప్లే బాగా విసిగిస్తుంది. ఫేక్ ఎమోషన్స్ దర్శకుడు ఎత్తుకున్న నిజాయితీ అంశాన్ని ప్రశ్నిస్తున్నట్లుంది.

టెక్నికల్ గా …

ఈ సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. ముఖ్యంగా విజువల్స్ చాలా రిచ్ గా , ట్రీట్ లా ఉండటానికి కారణం కెమెరా వర్క్. అలాగే సంతోష్ నారాయణ్ సంగీతం కొంతవరకూ సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం సినిమాకు ప్రాణం పోసింది. జీవా తన ఎక్సప్రెషన్స్ తో క్యారక్టర్ కు డెప్త్ తెచ్చాడు. ముస్లిం యువతిగా నటాషా సింగ్ ..డిగ్నిటీ, గ్రేస్ తో అల్లాడించింది.  చిన్న చిన్న డైలాగులతో ఆమె పాత్రను బాగా డిజైన్ చేసారు. ముఖ్యంగా కళ్ళ ఎక్సప్రెషన్స్ ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చాయి.  ఇక దర్శకుడు మంచి కాన్సెప్టుని తీసుకున్నా దాని ఎగ్జిక్యూషన్ స్క్రిప్టు స్దాయిలోనే సరిగా చేయలేదు. క్లైమాక్స్ తేలిపోయింది. ఎడిటర్ కు డైరక్టర్ పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు లేరు.

చూడచ్చా

ఎక్సపెక్టేషన్స్ లేకుండా చూస్తే ఫరవాలేదనిపిస్తుంది.

నటీనటులు : జీవ, నటాషా సింగ్, లాల్ జొస్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, సుశీల రామన్
సినిమాటోగ్రఫర్ : సెల్వ కుమార్
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాష్ట
దర్శకత్వం :  రాజు మురుగన్
నిర్మాత‌లు : అంబెత్ కుమార్
Run Time: 2 hours 36 minutes