టి.ఎస్.ఆర్ – టివి 9 సినీ అవార్డుల ప్రధానోత్సవం

Published On: February 18, 2019   |   Posted By:

టి.ఎస్.ఆర్ – టివి 9 సినీ అవార్డుల ప్రధానోత్సవం

విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ –  టివి 9 సినీ అవార్డుల వేడుక 

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018) 5వ వార్షికోత్సవ  ప్రధానోత్సవం  ఫిబ్రవరి 17న విశాఖపట్నం లో అశేష జనవాహిని మధ్య సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో  సినీ తారల ఆట పాటలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారు హాజరయ్యారు. ఈ వేడుకలో  చిరంజీవి, మోహన్ బాబు,బాలకృష్ణ, నాగార్జున, విశాల్, తో పాటు మరెందరో  సినీ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం తో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది… హీరోలందరూ సోదరభావం తోనే ఉంటాం …అని చెప్పి అభిమానులను సంభ్రమాచర్యాలకు గురిచేశారు.

ఈ కార్యక్రమాన్ని  అమర వీరులకు నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా..

సాంస్కృతిక సార్వభౌమ, కళాబంధు,రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – “ప్రతిభాషా ప్రేక్షకులకు తమ అభిమాన నటీనటులను,ఆర్టిస్టులను, టెక్నిషన్స్ ను సత్కరిస్తుంటే వారు ఎంతగానో ఆనందిస్తారు. అందుకని ఎంతో కృషితో రాత్రింబవళ్లు కష్టపడి టీవీ9 సహాయంతో  ఈ అవార్డ్స్ లను ప్రకటించడం జరిగింది. నాకు అభినందనలు కాదు …కళాకారుల ఆనందం కావాలి అందుకే గత 20 సంవత్సరాలనుండీ ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను మీ అందరి సంతోషమే నా శక్తి. ఒకే వేదికపై చిరంజీవి,మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున,విశాల్ లాంటి హీరోలను చూడడం కన్నుల పండుగగా ఉంది. భారత దేశ చరిత్రలో ఏ అవార్డ్ ల ఫంక్షన్ కూడా ఇలా ప్రజల సమక్షంలో జరగలేదు. అభిమానుల ఆనందం నాకు టానిక్ లాంటిది. కళాకారుడు ఈశ్వరునితో సమానం. వారిని ప్రోత్సహించడం అంటే ఈశ్వరున్ని ప్రోత్సహించడమే”అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ” మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారికి,సోదరుడు బాలక్రిష్ణ కి ,నా మనసుకు చాలా దగ్గరైన మోహన్ బాబు, నాగార్జున గారికి అలాగే అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమ సూత్రధారి టి సుబ్బరామిరెడ్డి గారికి,ఆయనకు సహకరించిన రఘురామ రాజు గారికి నా హృదయ పూర్వక వందనాలు.ఆహ్లాదకరమైన వాతావరణం,అందమైన సముద్ర తీరం, అంతకుమించి మంచి మనసున్న మనుషులు ఉంటారు కనుకనే విశాఖకు వచ్చే ఏ అవకాశం వదులుకొను. కళాకారుణ్ణి ప్రోత్సహించడం ద్వారా ఆతనికి కలిగే ఆనందంలోని శక్తిని నేను పొందుతాను అని చెప్పిన మహోన్నత వ్యక్తి సుబ్బిరామిరెడ్డి గారు.ఇంత మంది హీరోలను ఒకే స్టేజీ పై ఉంచడం ఆయనకే సాధ్యమైన పని. ఇక్కడికి ప్రతీ ఒక్కరూ ఆయన మీద అభిమానంతో ఎంతో ఇష్టంతో వచ్చారు. మా అందరి మధ్య సోదరానుబంధం ఉందని ప్రతి ప్రేక్షకునికీ తెలియచెప్పే తరుణం ఇది “అన్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ – “మంత్రి ఘంటా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు, ఆత్మీయుడు, కళాబంధు, టి సుబ్బరామిరెడ్డి గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ప్రతీ కళాకారుని హృదయంలో నాకు చోటుంటే చాలు అన్న మహోన్నత వ్యక్తి ఆయన.ఆయన పాల లాంటి వారు ఎవరికీ ఏం కావాలో అది తీసుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్ళ ఆయుష్షుతో పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. దాసరి గారు ఒకటి నుండి వంద వరకు ఆయనే…ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటు..ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి”అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – ” ప్రశాంత సాయం సమయాన..చల్లటి విశాఖ సముద్ర తీరాన ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథమహారధులు అందరికి నా హృదయ పూర్వక వందనాలు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక బృహత్తర కార్యాన్ని నిర్వహించడం ఆశా మాషీ విషయం కాదు. ఈ కార్యక్రమంలో అందరినీ ఒకే వేదిక పై కలపడం ఒక్క టీ ఎస్ ఆర్ గారికే చెల్లింది. ఆయన అజాత శత్రువు ఒక్క పిలుపునిస్తే అందరం హాజరవుతామ్.అభిమానులకు ఎన్నో మంచి సినిమాలు ఇవ్వమని వెన్ను తట్టి ముందుకు నడిపేదే …టి ఎస్ ఆర్ టీవీ9  అవార్డ్”అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందమైన మనుషులు, అన్నయ్యలందరు స్టేజ్ మీదనే ఉన్నారు.నాకు చాల ఇష్టం అయిన రంగస్థలం, మహానటి, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు అవార్డులు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు టి సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు”అన్నారు.

హీరో విశాల్ మాట్లాడుతూ – ” సినీ పరిశ్రమ లెజెండ్ లందరికి నా నమస్కారాలు. వీరందరి ఫోటోలు నా కబోర్డు పైన ఉంటాయి.అలాంటిది అందరిని ఒకే వేదికపై కలిపిన టి ఎస్ ఆర్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. అందరూ బాగుండాలి…వీలున్నంత వరకు సమాజానికి తోడ్పడాలి”అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – “తెలుగు సినిమా రాజులు అందరూ ఉన్న వేదికకు నా నమస్కారం. నాలాంటి కళాకారులు ఇంకా అవార్డులు తీసుకోవడం కొత్త తరం దర్శకుల సహకారంతోనే సాధ్యం. నటులకే నచ్చే సినిమాలు తీయడం వాటికి అవార్డులు ఇవ్వడం అంటే మాములు విషయం కాదు.. దేశ ఔన్నత్యాన్ని తెలియజేసే కలయిక ఇది”అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సిరివెన్నెల, విద్యాబాలన్ తో పాటు అవార్డు గ్రహీతలందరూ పాల్గొని టి సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

స్పెషల్‌ అవార్డ్స్‌

1. నేషనల్‌ స్టార్‌ శ్రీదేవి మెమోరియల్‌ అవార్డ్‌ – విద్యాబాలన్‌

2. దాసరి నారాయణరావు మెమోరియల్‌ అవార్డ్‌ – మోహన్‌బాబు

3. స్టార్‌ ప్రొడ్యూసర్‌ అవార్డ్‌ – బోనీకపూర్‌

4. లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డ్‌ – నగ్మా

5. అవుట్‌ స్టాండింగ్‌ సినీ లిరిక్‌ రైటర్‌ అవార్డ్‌ – సిరివెన్నెల సీతారామశాస్త్రి

6. జ్యూరి అవార్డ్‌ ”86 వసంతాల తెలుగు సినిమా” బుక్‌
రచయిత: డాక్టర్‌ కె. ధర్మారావు

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డు –  2017

1. బెస్ట్‌ యాక్టర్‌ – బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి),
2. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (రారండోయ్‌ వేడుక చూద్దాం)
3. బెస్ట్‌ హీరోయిన్‌ – రాశి ఖన్నా (జై లవకుశ, రాజా ది గ్రేట్‌)
4. బెస్ట్‌ హీరోయిన్‌ డెబ్యూట్‌ – షాలిని పాండే (అర్జున్‌రెడ్డి)
5. బెస్ట్‌ ఫిల్మ్‌ – గౌతమిపుత్ర శాతకర్ణి (రాజీవ్‌ రెడ్డి, సాయిబాబ)
6.మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ – ఖైది నంబర్‌ 150 (రామ్‌చరణ్‌)
7. బెస్ట్‌ డైరెక్టర్‌ – క్రిష్‌ జాగర్లమూడి (గౌతమిపుత్ర శాతకర్ణి)
8. మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ – వి.వి. వినాయక్‌ (ఖైది నంబర్‌ 150)
9. బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ – ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
10. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ – దేవిశ్రీప్రసాద్‌ (ఖైది నంబర్‌ 150)
11. బెస్ట్‌ సింగర్‌ (మేల్‌) – దేవిశ్రీప్రసాద్‌ (అమ్మడు లెట్స్‌ కుమ్ముడు – ఖైది నంబర్‌ 150)
12. బెస్ట్‌ సింగర్‌ (ఫిమేల్‌) – మధు ప్రియ (వచ్చిందే – ఫిదా)
13. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – రాజశేఖర్‌ (పిఎస్‌వి గరుడవేగ)
14. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – సుమంత్‌ (మళ్ళీ రావా)
15. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – అఖిల్‌ (హలో)
16. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ – నరేష్‌ వి.కె. (శతమానం భవతి)
17. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – రితికా సింగ్‌ (గురు)
18.స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ ఫిిల్మ్‌ – ఫిదా (దిల్‌ రాజు, శిరీష్‌)
19. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – డైరెక్టర్‌ – లేట్‌ బి. జయ (వైశాఖం)
20. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (మేల్‌) – మనో (పదమరి, పైసా వసూల్‌)
21. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (ఫిమేల్‌) – సోని (హంసనావ.. బాహుబలి2).

టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డు –  2018

1.బెస్ట్‌ యాక్టర్‌ – నాగార్జున (దేవదాస్‌)
2. బెస్ట్‌ హీరో – రామ్‌చరణ్‌ (రంగస్థలం)
3. బెస్ట్‌ హీరో డెబ్యూట్‌ – కళ్యాణ్‌ దేవ్‌ (విజేత)
4. బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ – రాజేంద్ర ప్రసాద్‌ (మహానటి)
5. బెస్ట్‌ కమెడి యన్‌-ఆలీ (నేల టిక్కెట్‌)
6. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – కీర్తి సురేష్‌ (మహానటి)
7. బెస్ట్‌ హీరోయిన్‌ – పూజాహెగ్డే (అరవింద సమేత)
8. బెస్ట్‌ హీరోయిన్‌ డెబ్యూట్‌ – ప్రియాంక జవాల్కర్‌ (టాక్సీవాలా)
9. బెస్ట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ – సాయి తేజస్విని (మహానటి)
10. బెస్ట్‌ ఫిల్మ్‌ – మహానటి (సి. అశ్వనీదత్‌, స్వప్న దత్‌, ప్రియాంక దత్‌)
11. మోస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ – రంగస్థలం (నవీన్‌, రవిశంకర్‌, మోహన్‌)
12. బెస్ట్‌ డైరెక్టర్‌ – నాగ్‌ అశ్విన్‌ (మహానటి)
13. మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ – సుకుమార్‌ (రంగస్థలం)
14. బెస్ట్‌ డైరెక్టర్‌ డెబ్యూట్‌ – వెంకీ అట్లూరి (తొలిప్రేమ)
15. బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ – థమన్‌ (అరవింద సమేత)
16. బెస్ట్‌ సింగర్‌ – మేల్‌ – అనురాగ్‌ కులకర్ణి (మహానటి… మహానటి)
17. బెస్ట్‌ సింగర్‌ – ఫిమేల్‌ – ఘంటా వెంకటలక్ష్మీ (జిగేల్‌ రాణి…. రంగస్థలం)
18. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (జయ జానకి నాయక)
19. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – నాగ చైతన్య (శైలజా రెడ్డి అల్లుడు)
20. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – కళ్యాణ్‌ రామ్‌ (నా నువ్వే)
21. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – సుప్రియ (గూఢ చారి)
22. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ డైరెక్టర్‌ – పరశురామ్‌ (గీత గోవిందం)
23. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ ఫిల్మ్‌ – తొలిప్రేమ (బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌)
24. స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ సింగర్‌ (ఫిమేల్‌) – మోహన భోగరాజు (అరవింద సమేత)

అవార్డ్స్‌ ఇన్‌ అదర్‌ లాంగ్వేజెస్‌

1. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – హిందీ (పద్మావత్‌)
అండ్‌ స్పెషల్‌ జ్యూరి అవార్డ్‌ – తెలుగు (సమ్మోహనం).
2. అవుట్‌ స్టాండింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ యాక్ట్రెస్‌ – తమిళ్‌ (ఖుష్బూ).
3. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – తమిళ్‌ కేథరీన్‌ థెస్రా (కథానాయకన్‌ – 2017)

4. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – కన్నడ ప్రియమణి (ద్వజ – 2018)

5. బెస్ట్‌ యాక్ట్రెస్‌ – పంజాబి జోనిత (శాంకి డరోగ – 2018)

6. బెస్ట్‌ యాక్టర్‌ – భోజ్‌పురి రవికిషన్‌ (శహన్‌షా – 2017