‘టెంపర్’ నోట్ల సీన్..రక్త బంధంతో అతికెన్

Published On: April 21, 2020   |   Posted By:

(from 1 min and 15 seconds)

(from 1 min and 40 seconds)

‘టెంపర్’ నోట్ల సీన్..రక్త బంధంతో అతికెన్

ఒక సినిమాలో ఓ సీన్ అద్బుతంగా పండితే అది అలా మన మనస్సులో గుర్తుండిపోతుంది. మరోసారి దాదాపు అలాంటి సన్నివేశమే చూస్తే ..అరెరే..దీన్ని ఎక్కడో చూసామే అనుకుంటాం. ఇది సామాన్య ప్రేక్షకుడు వెర్షన్. కానీ సినిమా వాళ్ల లెక్కలు వేరేగా ఉంటాయి. ఆ అద్బుతంగా పండిన సీన్…థియోటర్ లో వచ్చిన రెస్పాన్స్ తో సహా క్రియేటర్స్ సబ్ కాన్షియస్ మైండ్ లో అలా రిజిస్టర్ అయ్యిపోతుంది. తాము స్క్రిప్టు రాస్తున్నప్పుడు తమకు తెలుసో…తెలియకో అది డైలాగు రూపంలోనో…సీన్ రూపంలోనే అక్కడ అవసరాన్ని బట్టి మారి వాలిపోతుంది. కావాలని ఎడాప్ట్ చేయకపోయినా..సబ్ కాన్సియస్ మైండ్ దాన్ని తెలియకుండానే తెలివిగా స్క్రిప్టులోకి ఎక్కించేస్తుంది. మరో సారి అదే మ్యాజిక్ జరిగిపోతుంది. ఆ విషయం క్రియేటర్స్ అందరికి తెలిసిందే. ఇలాంటి విషయాలు సినిమాలు నిశితంగా చూస్తే ఒక్కోసారి మనకు తారసపడతాయి. ఇదిగో ఇక్కడ మనం మాట్లాడకోబోయే సన్నివేశం కూడా అలాంటిదే. ఈ సీన్ ని మీరు చాలా సార్లు చాలా సినిమాల్లో కొంచెం అటూ ఇటూలో చూసే ఉంటారు.

ఎన్టీఆర్,పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ లో ఓ సీన్ ఉంటుంది. చాలా ఎమోషనల్ సీన్ అది. పోసాని..ఎన్టీఆర్ ని నిలదీస్తూంటాడు. దానికి ఎన్టీఆర్ చెప్పిన సమాధానికి ఓ స్దాయిలో థియోటర్ లో రెస్పాన్స్ వచ్చింది. మరి రాసిందెవరు పూరి కదా..ఆ మాత్రం ఉంటుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన ఓ బ్యాగ్ లో ఎన్నో నోట్ల కట్టలు ఉంటాయి. వాటిని అన్యాయంగా తీసుకువచ్చారని, మనస్సాక్షి లేదని ఎన్టీఆర్ దగ్గర సబార్డనేట్ గా పనిచేసే పోసాని గట్టిగా తిట్టిపోసిన స్దాయిలో అది అవినీతి సొమ్ము..నువ్వు సునామీ వచ్చి కొట్టిపో ..అని శాపం పెడతాడు.. అంటూంటాడు. అది అక్రమ సొమ్ము నేను ముట్టుకోను అంటాడు. అప్పుడు ఎన్టీఆర్…పోసాని జేబులోంచి ఓ ఐదు వందల నోటు తీస్తాడు..అలాగే తన జేబులోంచి కూడా ఓ నోటు తీస్తాడు. రెండు కలిపేస్తాడు. ఇది..నీతి..అది అవినీతి అంటూ రెండు నోట్లను గట్టిగా కలిపేస్తాడు. చెప్పు..నీ నోటు ఏదో ..నా నోటు ఏదో చెప్పు అంటాడు. పోసాని…ఆ రెండు నోట్లలో ఏది ..ఏ నోటో అని చూస్తాడు. మనకీ అనిపిస్తుంది. నిజమే..కదా ఏ నోటైనా ఒకటే కదా అని….

ఈ సీన్ చూస్తే మనకు ఓ సీన్ టక్కున గుర్తు వస్తుంది. గతంలో వచ్చిన అనేక సినిమాలు మన కళ్లముందు కనపడతాయి.వాటిలో ఒకటి…బాగా పాపులర్ ..క్రాంతివీర్ సినిమాలోది. నానా పటేకర్…రెండు మతాలు వాళ్లు కొట్టుకుంటూంటే ఆపి…ఇద్దరి చేతిలను తన చేతిలోకి తీసుకుని నేల కేసి కొట్టి…ఆ రక్తం కలిపి..వాటిలో ఏదో ఎవరైనా చెప్పమని, రెండు ఒకేలా ఉందని, ఎవరిలో ప్రవహించేది అయినా ఒకే రక్తమని లాజిక్ గా చెప్తాడు. (అఫ్ కోర్స్ ..రక్తంలో గ్రూప్ లు వేరే అనుకోండి).

అదే సీన్ మనకు బిత్తిరి సత్తి హీరోగా వచ్చిన తుపాకి రాముడు సినిమాలో యాజటీజ్ కనపడుతుంది. తన ప్రేమించిన అమ్మాయి వాళ్లు వేరు..తను వేరు అన్నప్పుడు తన రక్తం..ఆ మరొకరి రక్తం తీసి..రెండు కలిపి..ఏ రక్తం ఎవరిదో చెప్పమంటాడు. అలా ఆ సీన్ ని వాళ్లు ఎడాప్ట్ చేసుకున్నారు.

అయితే తుపాకి రాముడులో యాజటీజ్ సీన్ ని వర్కవుట్ చేస్తే పూరి మాత్రం దాన్ని కరెన్సీ నోట్ల తో పోల్చి..చెప్తాడు. అక్కడే మనచేత మార్కులు వేయించుకుంటాడు. అది పూరి…క్రాంతివీర్ దృష్టిలో పెట్టుకుని రాసి ఉండకపోయి ఉండవచ్చు. కానీ ఆయన మనస్సులో అలాంటి సీన్ ఉండి…ఇలా నోట్ల డైలాగు రూపంలో బయిటకు వచ్చి ఉండవచ్చు. అలా ఒక్కో సారి వచ్చిన సీన్స్…రూపం మారి మనని అలరిస్తూంటాయి. మీకు ఇలాంటి సీన్స్ గుర్తు వస్తున్నాయా…వచ్చే ఉంటాయి…ఖచ్చితంగా. ఎందుకంటే మీలోనూ ఎక్కడో ఓ రైటర్ ఉండవచ్చు. వాడు ఇవన్నీ చూసి..కొత్త సీన్స్ వండే పనిలో ఉండచ్చు..కానియ్యండి.