డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రం ప్రీ-లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్

Published On: December 26, 2020   |   Posted By:
డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రం ప్రీ-లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్
 
`118` వంటి సూప‌ర్‌హిట్  చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ రెండో చిత్రంగా ఒక  డిఫ‌రెంట్  థ్రిల్ల‌ర్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` (హూ,వేర్‌,వై)ని రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే.
 
అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దా‌ట్ల నిర్మిస్తున్నారు.
 
ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.
 
ఈ చిత్రం ప్రీ-లుక్ పోస్ట‌ర్‌  డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు.
 
ఈ సంద‌ర్భంగా..
డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ – `గుహ‌న్ గారు చాలా పెద్ద టెక్నీషియ‌న్‌. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ జ‌ర్నీ నా`118` సినిమాతో ప్రారంభ‌మైనందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఒక మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చారు. నాకు అత్యంత ఆప్తులు. ఆయ‌న ఏం చేసినా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటాను. గుహ‌న్ గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన`డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` మూవీ  ప్రీ-లుక్ పోస్ట‌ర్‌ రిలీజ్ చేయ‌డం ఆనందంగా కాదు భాధ్య‌త‌గా ఫీల‌వుతున్నాను. ఈ సినిమా క‌థ విన్నాను. చాలా బాగుంది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.
 
ద‌ర్శ‌కుడు కెవి గుహ‌న్ మాట్లాడుతూ – “న‌న్ను, నా క‌థ‌ను న‌మ్మి నాకు ద‌ర్శ‌కుడిగా మొద‌ట‌ అవ‌కాశం ఇచ్చిన‌ క‌ళ్యాణ్‌రామ్ గారి పేరు నా త‌దుప‌రి చిత్రానికి కూడా ఏదో ర‌కంగా ఉండ‌డం సెంటిమెంట్‌గా భావించి`డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` ప్రీ-లుక్ పోస్ట‌ర్‌ క‌ళ్యాణ్ రామ్ గారితో రిలీజ్ చేయించ‌డం జ‌రిగింది. బిజీ షెడ్యూల్‌లో కూడా నా కోసం స‌మ‌యం కేటాయించిన క‌ళ్యాణ్ రామ్ గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 
చిత్ర నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు దా‌ట్ల మాట్లాడుతూ – “మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్నతొలిచిత్రం టైటిల్ లోగోని పోస్ట‌ర్‌ని నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ గారు రిలీజ్‌చేయ‌డం శుభ‌సూచ‌కంగా భావిస్తున్నాం. గుహ‌న్ గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ఆడియ‌న్స్‌ని 100% ఈ చిత్రం థ్రిల్ చేస్తుంది. థ్రిల్ల‌ర్స్‌లోనే ఇది ట్రెండ్‌సెట్ట‌ర్ అవుతుంది“ అన్నారు.
 
హీరో అధిత్ అరుణ్ మాట్లాడుతూ – “న‌ట‌న‌నే ప్రాణంగా భావించే నంద‌మూరి కుటుంబంలోని యువ క‌థా నాయ‌కుడు క‌ళ్యాణ్‌రామ్ గారు మా మూవీ టైటిల్ లోగోను రిలీజ్ చేసి నందుకు హ్యాపీగా ఉంది. ఆయ‌న‌కి ఎప్పుడూ నేను ఋణ‌ప‌డి ఉంటాను.నా కెరీర్‌కి గుహ‌న్ గారు ఈ చిత్రంతో ట‌ర్నింగ్ పాయింట్ ఇస్తున్నారు. డెఫినెట్‌గా సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంది“ అన్నారు.
 
హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – “క‌ళ్యాణ్ రామ్ గారు మా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితులు. ఆయ‌న చేతుల మీదుగా నా మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌కావ‌డం సంతోషంగా ఉంది. క‌ళ్యాణ్ రామ్ గారి విషెస్‌తో ఈ చిత్రం విజ‌యం మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. గుహ‌న్‌గారి డైరెక్ష‌న్‌లో ఓ థ్రిల్లింగ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం నా అదృష్టం“ అన్నారు.
 
కో-ప్రొడ్యూస‌ర్‌ విజ‌య్ ధ‌ర‌ణ్ దట్ల మాట్లాడుతూ – “మంచి మ‌న‌సున్న క‌ళ్యాణ్ రామ్‌గారు మా టైటిల్‌లోగోని ఆవిష్క‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది“అన్నారు
 
అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల,
క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.