డబ్ స్మాష్ చిత్రo సాంగ్ విడుదల

Published On: October 1, 2019   |   Posted By:
డబ్ స్మాష్ చిత్రo సాంగ్ విడుదల

 
సినీ ప్రముఖుల సమక్షంలో డబ్ స్మాష్ సాంగ్ విడుదల
 
వి.త్రి ఫిలిమ్స్, సుబ్రమణ్యం మలాసిని ప్రెజెంట్స్ డబ్ స్మాష్ సాంగ్ విడుదల సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండ్స్ మీద ఈ పాట ఉండడం విశేషం. ఈ పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర్ ప్రసాద్, రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
 
ఈ సందర్బంగా నిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ…
 
అందరికి నమస్కారం. నవంబర్ లో ఈ సినిమా మొదలు పెట్టామని నాన్న చెప్పారు. మా అన్నయ్య ఈ సినిమాలో నటించినందుకు హ్యాపీ గా ఉంది. హ్యాపీడేస్ తరహాలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికి ధన్యవాదాలు తెలిపారు.
 
లిరిక్ రైటర్ బాల వర్ధన్ మాట్లాడుతూ…
 
మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ ఈ సినిమాను కిలిసి ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా చేశారు. సినిమా పాట ఈ చిత్రంలో హైలెట్ కానుంది. ఈ పాట రాసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం, అందుకు దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాలి. అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 
 
డైరెక్టర్ కేశవ్ దేవుర్ మాట్లాడుతూ…
 
తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. తెలుగు సినిమా లెజెండ్స్ మీద పాట మా సినిమాలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంతమంది టెక్నీషియన్స్ ను ముందుగా కలిసి ఈ సినిమాను చెయ్యమని అడిగాను, ఆ తరువాత నిర్మాతను కలిసి ఈ సినిమా కథ చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ మీద వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ వల్ల ఏం జరిగింది అన్నేదే ఈ సినిమా కథాంశం. ఈ సీనిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా  ఉంటుంది. డబ్ స్మాష్ తో పరిచయం అయ్యి, డబ్ స్మాష్ వల్ల పాపులర్ అయిన జంట ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అన్నీ పాటలు బాగా వచ్చాయి, ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు. 
 
ఎస్.వి.ఎన్ రావు మాట్లాడుతూ…
 
డబ్ స్మాష్ చిత్రంలో నటించిన నటీనటులు అందరికి బెస్ట్ విషెస్, దర్శకుడు కేశవ్, నిర్మాత లక్ష్మీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. వీరు ఇలాంటి మంచి చిత్రాలు భవిషత్తులో మరిన్ని తియ్యలని కోరుకుంటున్న అన్నారు.
 
హీరో పవన్ కృష్ణ మాట్లాడుతూ…
 
వచ్చిన అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. మా చిత్ర నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఈ సినిమాను తీశారు. ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాను. పాటలు సినిమాలో చాలా బాగా ఉంటాయి. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
 
హీరోయిన్ సుప్రజ మాట్లాడుతూ…
 
ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
 
సహా నిర్మత గజేంద్ర మాట్లాడుతూ…
 
మేము చిన్న సినిమా అయినా సరే ప్యాషన్ తో తీసాము. మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.
 
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…*
 
టైటిల్ బాగుంది. హనెస్ట్ గా ఈ సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది. సినిమా లెజెండ్స్ మీద పాట చెయ్యాలనే ఆలోచన రావడం, అది చక్కగా ఈ సినిమాలో కుదరడం బాగుంది. కంటెంట్ బాగుంటే సినిమా విజయం సాధిస్తుంది. ఈ మూవీ యూత్ ఫుల్ గా ఎంటర్టైనర్ గా ఉండబోతోందని భావిస్తున్నానాని తెలిపారు.
 
నిర్మాత దామోదర్ మాట్లాడుతూ…
 
సినిమా క్వాలిటీతో తీశారు. సినిమా ప్రముఖుల మీద చిత్రీకరించిన సాంగ్ కొత్తగా ఉంది. చిన్న సినిమాను అవగాహనతో అన్నీ తెలుసుకొని చేస్తే విజయం సాధిస్తుంది. ఈ మూవీ అదే తరహాలో ఉంటుందని అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు
 
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…
 
చిన్న సినిమాలే ఈ మధ్య విజయం సాధిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా ప్రేక్షకులు ఈ మూవీని ఆధారిస్తారని, ఈ చిత్రంలో పని చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
 
నటీనటులు:
గెటప్ శ్రీను, పవన్ కృష్ణ (హీరో) సుప్రజ (హీరోయిన్)
 
సాంకేతిక నిపుణులు:
 
దర్శకత్వం: కేశవ్ దేవుర్
నిర్మాత: ఓంకార లక్ష్మీ 
సహా నిర్మాత గజేంద్ర తిరకాల
కెమెరామెన్: ఆర్.రమేష్
మ్యూజిక్:వంశీ
ఎడిటర్: గ్రేసన్
ఫైట్స్: ఫైర్ కార్తిక్
లిరిక్స్: బాల వర్ధన్
కాస్ట్యూమ్స్: డయానా
మేకప్: రామ్ మోహన్
ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్
కథ, మాటలు: ఏ.వి.రావ్