డియర్ మేఘ చిత్రం లిరికల్ సాంగ్ రిలీజ్

Published On: July 30, 2021   |   Posted By:

డియర్ మేఘ చిత్రం లిరికల్ సాంగ్ రిలీజ్

”డియర్ మేఘ” చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన ‘బాగుంది ఈ కాలమే’ లిరికల్
సాంగ్ రిలీజ్

మ్యూజికల్ హిట్ దిశగా ”డియర్ మేఘ” అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల ‘ఆమని ఉంటే పక్కన’ పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా తాజాగా
సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘బాగుంది ఈ కాలమే’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. ‘బాగుంది ఈ
కాలమే’ పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.

ఊరికే ఇంత కాలం ఉంటున్నా…ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా …ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే పోయెనా, వేదనే తీరెనా…బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.

”డియర్ మేఘ” చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ  సినిమాను రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ”డియర్ మేఘ” చిత్రం అతి త్వరలో థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ -ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, . నిర్మాత – అర్జున్ దాస్యన్, రచన, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి