తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ కొత్త మూవీ లుక్

Published On: August 24, 2020   |   Posted By:
తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ కొత్త మూవీ లుక్
 
 
‘‘ఓ బేబి’’ ఫేంసజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కొత్త మూవీ
 
మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న మూవీ నుండి హీరో తేజ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి అతని లుక్ ను రివీల్ చేసారు మేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ:
 
‘‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అన్నారు.
 
నటీనటులు : తేజ సజ్జ,శివానీ రాజశేఖర్,తులసి, శివాజీ రాజా,సత్య,మిర్చి కిరణ్,దేవీ ప్రసాద్ తదితరులు.
 
సాంకేతిక నిపుణులు :
కథ : ప్రశాంత్ వర్మ
డైలాగ్స్: లక్ష్మీ భూపాల
మ్యూజిక్: రథన్
సినిమాటోగ్రఫీ: విద్యా సాగర్
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
లిరిక్స్: కృష్ణ కాంత్
కాస్ట్యూమ్స్: సంతోషి రామ్
నిర్మాతలు: చంద్ర శేఖర్ మొగుల్ల,సృజన్ యరబోలు
దర్శకత్వం: మల్లిక్ రామ్