త్రివిక్రమ్ భాషలో ‘నో మీన్స్‌ నో..’ అంటే…

Published On: April 26, 2020   |   Posted By:

“గొప్పదో చెత్తదో మనమొక ఆఫర్ ఇచ్చాక ఆయ్యా మాకొద్దు అంటే దానర్దం వద్దు అని, అందులో ప్రధానంగా మరీ ముఖ్యంగా ఒక స్త్రీ వద్దు అంటే మాత్రం దానర్దం అసలు వద్దు అని..”

యస్.. ఇది త్రివిక్రమ్ రాసిన డైలాగే..అల వైకుంఠపురములో లోదే…అల్లు అర్జున్ చెప్పిందే.

అవును..ఇప్పుడీ డైలాగు ఎందుకు గుర్తు వచ్చిందీ అంటే….ఈ డైలాగు విన్నప్పుడు మరో డైలాగు గుర్తు వచ్చింది కాబట్టే…అవును..పింక్ సినిమాలో ‘నో మీన్స్‌ నో..’ అనే డైలాగు ఎవరికైనా ఈ డైలాగు విన్నప్పుడు గుర్తుకు వచ్చి తీరుతుంది. అఫ్ కోర్స్ ఆ సినిమా చూస్తేనే సుమా. ఎందుకంటే ఆ డైలాగు అంతలా పాపులర్ అయ్యింది..ప్రపంచ వ్యావహారిక డిక్షనరీ లో చేరింది. ఆ డైలాగు రాసేటప్పుడు తెలియదు…ఈ చిన్న డైలాగు ప్రపంచాన్ని కుదిపేస్తుందని…మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందని. ఏముందా డైలాగులో ప్రత్యేకత అంటే… ఎంత సింపుల్ గా ..ఎంత ఎఫెక్టివ్ గా మాటలను మనస్సులోకి,మన ధృక్పదంలోకి ఎక్కించవచ్చో ఈ డైలాగు మనకు పాఠం నేర్పుతుంది. యస్… హిందీ చిత్రం పింక్‌లో అమితాబ్‌ బచ్చన్, దాని తమిళ రీమేక్‌ నేర్కొండ పార్వై చిత్రంలోనూ అజిత్‌ చెప్పిన డైలాగ్‌ నో మీన్స్‌ నో. త్వరలో మన వకీల్ సాబ్ కూడా అదే డైలాగుని చెప్పబోతున్నారు.

మహిళల విషయంలో నో అంటే చిన్న విషయం కాదని, అందులో చాలా భావం ఉందని స్ట్రాంగ్‌గా చెప్పారీ డైలాగుతో. ‘‘నో మీన్స్ నో’’ అంటూ.. రేప్ చేసేందుకు వచ్చిన వాడితో మై క్లైంట్ సెడ్ నో యువరానర్ అంటూ కోర్టులో లాయిర్ గా(అమితాబ్ బచ్చాన్) వాదించి విజయం సాధిస్తాడు. ఆ డైలాగు ఓ సారి విన్నాక మన మైండ్ లో అలా రిజస్టర్ అయ్యిపోతుంది. క్రియేటర్ అయితే తన వర్క్ లో బయిటకు వస్తుంది. మామూలు వాడికైతే అటువంటి సంఘటన జీవితంలో జరిగితే దానంతటే అదే తెలియకుండా బయిటకు దూకుతుంది. అవునూ…జస్ట్ క్యూరియాసిటీకు ఇంత పవర్ ఫుల్ ఈ డైలాగు ఆలోచన ఎలా పుట్టింది ఆ రైటర్ కు, డైరక్టర్ కు ఎలా పుట్టిందా అని ఎప్పుడైనా అనిపించిందా..అనిపించకపోయినా , మేమే చెప్పేస్తాం.

పింక్ సినిమాలో మొదట ఈ డైలాగుని స్క్రిప్టులో రాసుకోలేదట. సినిమాలో ఓ పెద్ద ఇంటరాగేషన్ సీన్ తాప్సీ మీద తీసాక, ఇంక మళ్లీ అదే కంటెంట్ ని రిపీట్ చేస్తూ ..లాంగ్ స్పీచ్ ఉండటం అనవసరం అనిపించింది అమితాబ్. నేను ఆల్రెడీ అంతా చెప్పేసాను…నేను కేవలం నో అనేసి కూర్చుంటాను అన్నారు. సరే అలాగే షూట్ చేద్దామనుకున్నారు. కానీ దర్శకుడు షా మనస్సలో ఇంకా ఏదో మెదులుతోంది. ఈ లోగా అతనికి స్నేహితులు ఫేస్ బుక్ లో ఓ ఇమేజ్ పంపించారు. అందులో ఓ కాఫీ మగ్ …దానిపై ఒకే ఒక వాక్యం రాసి ఉంది… నో ఈజ్ ఎ కంప్లీట్ సెంటిన్స్ అని. అది చదవగానే ఆయన మైండ్ లో ఓ ప్లాష్ వెలిగింది. దాన్ని సానపట్టగా వచ్చిందే.. మనం విన్నది.. చూస్తున్నది. ఆ తర్వాత మనం అలవైకుంఠపురములో దాని ఇంకో వెర్షన్ ని చూసాం. త్రివిక్రమ్ మీద ఆ డైలాగు ఎంత ఇపాక్ట్ వేసిందంటే..మరో చోట…అలవైకుంఠపురములో జయిరాం పాత్ర ఇలా అంటుంది..

“వంటోడికి, వెయిటర్ కు ‘నో’ చెప్పటం ఈజీ రా,పవర్ ఫుల్ వాడికి ‘నో’ చెప్పటం చాలా కష్టం. ఎంత పెద్దోడికి ‘నో’ చెప్తే అంత గొప్పోడివి అవుతావు..”

ధట్స్ ఇట్.. ‘నో’ కామెంట్