నాట్యం సినిమా పాట‌ రిలీజ్

Published On: October 8, 2021   |   Posted By:
 
నాట్యం సినిమా పాట‌ రిలీజ్

`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి  ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
తాజాగా నాట్యం సినిమా నుండి `వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు…` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు  శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు.  అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.

ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  

న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:

స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌
నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌
సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌
పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌
ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి