నీ కోసం సినిమా పాటల విడుదల

Published On: February 11, 2019   |   Posted By:

నీ కోసం సినిమా పాటల విడుదల

రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘నీ కోసం’ మొదలయ్యే ఇలా ఎలా  పాట విడుదల. 

ప్రేమ కథలకు సీజన్ ఉండదు. మనసు పెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా నీకోసం.  ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నీ కోసం’.  రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ తగ్గకుండానే ప్రేమకథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోన్న ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక తాజాగా నీకోసం చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘తొలితొలిగా’ అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. 

పెళ్లిచూపులు తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి నీకోసం రెండో పాట ను మొదలయ్యింది ఇలా ఎలా పాటను విడుదల చేసారు.న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా ఈ మూవీ లుక్ ఉందని ప్రశంసించారు.  

లవ్ స్టోరీలో ఎమోషన్ కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ టచెస్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందీ చిత్రంలో. ఇది ప్రేమకథే అయినా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టునే అన్ని అంశాలూ ఉంటాయి.

తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అవినాష్ కోకటి దర్శకుడు.

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది.  అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది యూనిట్. ప్రేమలో సున్నితమైన ఎమోషన్స్ టచ్ చేస్తూ ప్రేమలో భిన్నమైన కోణాలను స్పృశించబోతోన్న ఈ చిత్రంలో అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన జంటలుగా నటిస్తుండగా,కమెడియన్ సుదర్శన్, ఈ రోజుల్లో సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

సాంకేతికంగా ఉన్నతంగా కనిపించబోతోన్న ఈ చిత్రానికి సంగీతం : శ్రీనివాస్ శర్మసినిమాటోగ్రఫీ : శివకృష్ణ,ఎడిటర్  : తమ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజేశ్వరి అన్నపురెడ్డి,ఆర్ట్ : క్రాంతి ప్రియం, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె. మీడియా, పబ్లిసిటీ డిజైనర్ : రాజాజీ డిజైన్స్, సహ నిర్మాతలు : సోమశేఖర్ రెడ్డి మరియు అల్లూరిరెడ్డి.ఏ, నిర్మాత : అల్లూరమ్మ(భారతి),రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి