పాగల్‌ మూవీ రివ్యూ

Published On: August 14, 2021   |   Posted By:

 

పాగల్‌ మూవీ రివ్యూ

విశ్వక్‌ సేన్‌ ‘పాగల్‌’ రివ్యూ
Rating: 2/5

హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో  విశ్వక్‌ సేన్‌. ప్రతీ సినిమాకు వైవిధ్యమైన ప్లాట్ ని ఎంచుకుంటున్న ఈ హీరో తాజాగా  ‘పాగల్‌’ అనే చిత్రమైన టైటిల్ తో మన ముందుకు వచ్చారు. టీజర్‌, ట్రైలర్‌ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న  ఈ చిన్న సినిమాకు దిల్ రాజు నిర్మాత కావటం ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఈ నేపధ్యంలో  ‘పాగల్‌’పై  పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది.  అంచనాలకు  స్దాయికు తగ్గ సక్సెస్ ని సాధించాడా, అసలు ఈ చిత్రం కథేంటి..పాగల్ టైటిల్ పెట్టడం వెనక విషయం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

చిన్న తనంలోనే తల్లిని కోల్పోతాడు ప్రేమ్(విశ్వక్ సేన్). దాంతో నిజమైన  ప్రేమను వెతుక్కుంటూ పెరిగి పెద్దవుతాడు.  తల్లి ప్రేమ దొరకటం అనేది కేవలం మరో అమ్మాయి వల్లే సాధ్యమవుతుందనే స్నేహితుడు మాటలు నమ్ముతాడు.అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు. ప్రేమలో ఏమీ ఆశించకూడదు అని  అమ్మ చెప్పిన మాటలను కూడా ప్రేమ్‌ మనసులో పెట్టుకొని తన జర్నీలో పలకరించిన ప్రతీ ప్రతి అమ్మాయికి ప్రపోజ్‌ చేస్తాడు. అంతేకాదు నన్ను ప్రేమిస్తే అమ్మలా చూసుకుంటానంటూ హామీ ఇస్తాడు. అలా 1600 మంది అమ్మాయిల ముందు త‌న మ‌న‌సు పరుస్తాడు. కానీ, అత‌ని ప్రేమకి తిరస్కార‌మే ఎదుర‌వుతుంది.   కొంతమంది అమ్మాయిలు ఓ అడుగు ముందుకేసి డబ్బు కోసం అతన్ని వాడుకొని ప్రక్కన పెట్టేస్తారు. ఈ క్రమంలో ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని డిసైడ్ అవుతాడు. అప్పుడు తీర (నివేదా పేతురాజ్‌) అతన్ని ప్రేమిస్తున్నాని రివీల్ చేస్తుంది.  ఇంత‌కీ తీర ఎవ‌రు? నిజంగా ప్రేమ్‌ని ఆమె ప్రేమించిందా?  వాళ్లిద్దరి క‌థ సుఖాంత‌మైందా? పొలిటీషన్  రాజిరెడ్డి అలియాస్‌ రాజీ (మురళీశర్మ)తో ప్రేమ వ్యవహారం ఏమిటి.. ? వంటి ష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
   
ఎనాలసిస్…
సైకాలజిస్ట్ లు చెప్పేదేమిటంటే..చాలా మంది మగవాళ్లు తల్లి లా ఉండేలాంటి వాళ్లనే గర్ల్ ప్రెండ్స్ గా, భార్యగా ఎంచుకుంటారు. ఈ పాయింట్ నే ఈ సినిమాకు మెయిన్ ప్లాట్ గా తీసుకున్నారు.అయితే దాన్ని ట్రీట్ చేయటంలోనే చాలా ఇల్లాజికల్ గా మారిపోయింది. ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్ లోపాలు ఉండటమే దెబ్బకొట్టింది. ఫస్టాఫ్ మొత్తం అమ్మాయిల వెనక పడి ప్రపోజ్ చేయటం, వాళ్లను రిజెక్ట్ చేయటమే సరిపేట్టేసారు. చివరకు మగవాడుతో ప్రేమలో పడటం  ఏదో వెరైటి అనుకుని ఆ ప్రయోగమూ చేసేసారు. అవన్నీ సినిమాటిక్ గా ఏదో స్క్రిప్టు ప్రకారం జరిగిపోతున్నట్లు ఉంటాయి. తప్పించి ఎక్కడా కథలో భాగంగా అనిపించవు. అలాగే ఈ డైరక్టర్ ఈ లవ్ స్టోరీ లో మరో ప్రయోగం పెట్టాడు. అదేమిటంటే..ఈ సినిమా ఫస్టాఫ్ లో ఎక్కడా హీరోయిన్ కనపడదు. సెకండాఫ్ లోనే ఆమె ఎంట్రీ. ఆ తర్వాత అయినా కథ బాగుంటుందా అంటే బోర్ కొట్టేస్తుంది. ఎమోషన్స్ వస్తూంటాయి కానీ మనని కదిలించే స్దాయిలో ఉండవు.  `మీ అమ్మాయిని ఎంత ప్రేమించానో మీకు తెలియాల‌నే.. మిమ్మ‌ల్ని ప్రేమించా` అనే దరిద్రపు ఐడియా ఈ సినిమాలోనే కనిపిస్తుంది. ఆ సీన్స్ చూస్తున్న కొలిదీ అవి గే లవ్ సీన్స్ లా అనిపించి జుగుప్స కలిగిస్తాయి. ఏదో సెకండాఫ్ లో వచ్చే  ప్రేమ్‌, తీర మ‌ధ్య కొన్ని స‌ీన్స్  మిన‌హా అంతా అతి వ్యవ‌హారంలా అనిపిస్తుంది. క‌థ కూడా ప్రేక్షకుడి ఊహకు అందేస్తుంది. ఏదైమైనా అక్కడ‌క్కడా కామెడీ మిన‌హా సినిమాలో చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏమీలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే బాగుంది.

ఏవి బాగున్నాయి?

విశ్వక్ సేన్ ఫెరఫార్మెన్స్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
ఫస్టాఫ్ కామెడీ

ఏమి బాగోలేవవు?

అతి మెల్లిగా సాగే సెకండాఫ్
అర్దం పర్దం లేకుండా కథలో అడ్డం పడే సాంగ్స్
ఎమోషన్ కంటెంట్

టెక్నికల్ గా…

కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి..ఈ సినిమాని ఎమోషన్స్, డ్రామా, కామెడీతో నింపాలని చాలా కష్టపడ్డాడు. కానీ ప్యాకేజ్ కుదరలేదు. అన్ని ఎలిమెంట్స్ ఒకే ప్యాకేజిలో కూర్చోలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది.
 
నటీనటుల్లో ..
ఈ సినిమాకు ఏకైక బలం విశ్వ‌క్ సేన్ ట్రెండీగా లుక్స్. పెద్ద మైనస్ బాబోయ్ అనిపించే స్క్రిప్టు. యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీ అని న‌మ్మ‌కం క‌ల్పించి చావు దెబ్బ కొట్టిన డైరక్టర్.  హీరోయిన్ గా నివేదా ఫస్టాఫ్ లో అసలు లేదు.. సెకండాఫ్‌లో కనపడే పార్టే ఎక్కువ‌. బాగానే చేసింది కానీ ఆమెకు డబ్బింగ్ చెప్పిన చిన్మయ  గొంతు వర్కవుట్ కాలేదు. భూమిక‌ది అలా వచ్చి ఇలా వెళ్లిపోయే గెస్ట్ రోల్‌. ముర‌ళీశ‌ర్మ ఇలాంటి పాత్రలు చేయటం నల్లేరు మీద నడక.
 
చూడచ్చా

ఫోర్స్ గా,డెప్త్ లేకుండా సాగే ఈ లవ్ స్టోరీని ఎవాయిడ్ చేయటమే బెస్ట్

 తెర వెనుక..ముందు

నిర్మాణ సంస్థ :  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,  లక్కీ మీడియా
నటీనటులు : విశ్వక్‌ సేన్‌,  నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ  తదితరులు
సంగీతం :  రధన్‌
సినిమాటోగ్రఫీ : ఎస్‌. మణికందన్
నిర్మాతలు : బెక్కెం వేణుగోపాల్‌
దర్శకత్వం:   నరేష్‌ కుప్పిలి
రన్ టైమ్ :  2 గంటల 18 నిముషాలు
విడుదల తేది : ఆగస్ట్‌ 14,2021