పోయే ఏనుగు పో మూవీ టైటిల్ లోగో విడుద‌ల

Published On: March 10, 2020   |   Posted By:
పోయే ఏనుగు పో మూవీ టైటిల్ లోగో విడుద‌ల
 
 
పోయే ఏనుగు పో`మూవీ టైటిల్ లోగోను విడుద‌ల చేసిన  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. 
 
ఒక ఏనుగు కొంత మంది చిన్న పిల్లల మధ్య జరిగే అద్భుతమైన సన్నివేశాలతో రూపొందుతున్న చిత్రం `పోయే ఏనుగు పో. కెవి రెడ్డి దర్శకత్వంలో పికెఎన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.రాజేంద్రన్ తెలుగు, తమిళం లో `పో యానైకుట్టియే పో` పేరుతో  నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మంచి బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు  టైటిల్ లోగో, బేనర్ లోగోను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా..
 
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “పోయే ఏనుగు పో. టైటిల్ చాలా కొత్తగా ఉంది. దర్శకుడు కెవి రెడ్డి మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో విడుదల చేయడం మంచి విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
చిత్ర నిర్మాత ఎం.రాజేంద్రన్  మాట్లాడుతూ – ‘మా మూవీ టైటిల్ లోగో, బేనర్ లోగోను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.  ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు కెవి రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచి కుటుంబ కథా చిత్రం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే తెలుగు తమిళ భాషలో విడుదల చేస్తాం” అన్నారు.
 
సాంకేతిక నిపుణులు :
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కెవి రెడ్డి,
నిర్మాత: ఎం.రాజేంద్రన్,
కథ: ఎస్. అరవింద్ కేశవన్,
సినిమాటోగ్రఫీ: అమర్. జి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో,
లిరిక్స్ : శ్రీ శ్రీరాజ్,
మాటలు: అవినాష్, రమేష్ రెడ్డి, కెవి రెడ్డి,
ప్రొడక్షన్ మేనేజర్ : మధు  సిహెచ్,
పిఆర్ఓ: సాయి సతీష్.