ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ రీ ఓపెనింగ్

Published On: September 29, 2020   |   Posted By:

ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ రీ ఓపెనింగ్

అక్టోబరు 1 నుండి ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్

క‌రోనా మ‌హ‌మ్మారీ భ‌యాల‌తో సినీప‌రిశ్ర‌మ స‌న్నివేశం తెలిసిన‌దే. అయితే ఇప్పుడిప్పుడే స్టార్లు షూటింగుల‌కు రెడీ అవుతుంటే త్వ‌ర‌లోనే థియేట‌ర్లు తెరిపించేందుకు కేంద్రం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల కానున్నాయ‌ని తెలుస్తోంది. తాజాగా ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. 

అక్టోబర్ ఒకటవ తేదీ  2020 నుండి అల్పాహారం, ఎగ్జిక్యూటివ్ లంచ్, టేక్-అవే ఫుడ్, సండే బఫే, స్పోర్ట్స్ విభాగం, స్పా & గెస్ట్ రూమ్ ల సేవలతో ఎఫ్‌.ఎన్.‌సి.సి తెరిచి ఉంటుంది. 

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఐడీ కార్డ్ ఉన్న స‌భ్యుల‌ను మాత్రమే అనుమ‌తించ‌నున్నారు. ప్రవేశానికి ఫేస్ మాస్క్ ,టెంప‌రేచ‌ర్ థ‌ర్మ‌ల్ తనిఖీ ఏర్పాట్లు ఉంటాయి.

అతిథులు మాత్రం ఖచ్చితంగా అనుమతించరు.