బ్యాచిలర్ పార్టీ చిత్రం నవంబర్ రిలీజ్

Published On: September 3, 2019   |   Posted By:
 
బ్యాచిలర్ పార్టీ చిత్రం నవంబర్ రిలీజ్
 
 అనన్య ప్రజంట్స్ పతాకం పై భూపాల్ ,అరుణ్ , ప్రియాంక ,సంజన హీరో హీరోయిన్స్  గా D రామకృష్ణ దర్శకత్వం లో రోపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాచిలర్ పార్టీ.  వినాయకచవితి సందర్భంగా  ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్  లాంచ్ చేసారు . 
 
 ఈ సందర్భం గా దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ  ఇది ఒక యాక్షన్ వెరైటీ .ఈ లో అన్ని కమర్షిల్ హంగులు ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ సుబ్బారావు శ్రీనివాస్ గార్లు చక్కటి సహకారం అందించారు.మా ఆర్టిస్టులు భూపాల్ , అరుణ్ , రమణారెడ్డి చక్కగా యాక్ట్ చేసారు.ఈ చిత్రాన్ని నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు .
 
హీరో అరుణ్ కురిటి  మాట్లాడుతూ ఇది నా మొదటి చిత్రం డైరెక్టర్ గారి సహకారంతో చాల చక్కగా నటించాను . అలాగే భూపాల్ , రమణారెడ్డి  నా కో ఆర్టిస్టులు గా చక్కని సహకారం అందించారు ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి పేరు తెస్తుంది అని ఆశిస్తున్నాను  అని అన్నారు .
 
ఇంకా ఈ కార్యక్రమం లో జబర్డస్ట్ నవీన్ , రైటర్ మాణిక్యలరావు కారేపల్లి  తదితరులు పాల్గొన్నారు .
 
అరుణ్ కురిటి , భూపాల్ , ప్రియాంక , సంజన , గిరి , జబర్డస్ట్ మహేష్ , జబర్డస్ట్ నవీన్ ,చిత్రం శీను ,రమణ రెడ్డి ,  వెంకటేష్ గౌడ్ , శిరీష  తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : ప్రమోద్ కుమార్ , DOP : ఆనంద్ మురళి రచన సహకారం : కారేపల్లి మాణిక్యాలరావు , రాజేష్ సవరపు  
ప్రొడ్యూసర్స్ : సుబ్బారావు డి, శ్రీనివాస్ సంపంగి  , రచన దర్శకత్వం : డి రామకృష్ణ