భాను శంకర్ చౌదరి ఇంటర్వ్యూ

Published On: October 8, 2019   |   Posted By:
భాను శంకర్ చౌదరి ఇంటర్వ్యూ
 
 
ఆర్.డి.ఎక్స్ లవ్ డైరెక్టర్ భాను శంకర్ చౌదరి ఇంటర్వ్యూ..

తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
 
ఈ సందర్భంగా నంది అవార్డు గ్రహీత దర్శకుడు భాను శంకర్ చౌదరి మీడియాతో మాట్లాడారు. పాయల్‌ రాజ్‌పుత్‌ మంచి నటి అని, ఈ సినిమాలో ఆమెది చాలా బలమైన పాత్రయని చెప్పారు దర్శకులు. బోల్డ్ కంటెంట్ మాత్రమే తీసుకుని బోల్డ్ గా చెప్పాలని అనుకోవడం ఒక పద్దతి అని, కానీ సినిమా బోల్డ్ కంటెంట్ తో సామాజిక కోణం స్పృసిస్తూ చెప్పిన కథ ఇది అని దర్శకులు చెప్పారు. కావాలని బోల్డ్ కంటెంట్ తో సినిమా తీయలేదని యూత్ ని టార్గెట్ చేయాలని కథలో బోల్డ్ కంటెంట్ పెట్టలేదని సినిమాకి అవసరం ఉండడంతో బోల్డ్ కంటెంట్ పెట్టినట్లు చెప్పారు. కథలోనే యూత్ టార్గెట్ అంశాలు చాలా ఉన్నట్లు వెల్లడించారు.
 
 
తన గత సినిమా అర్థనారిలో కరెంట్, రోడ్, ఓటు హక్కు.. ఇలా సమాజంలో కళ్ల ముందు ఉండే ప్రతి అంశం గురించి ప్రస్తావించానని, సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించడం వల్లే సమాజంలో అన్యాయాలు ఎక్కువ అవుతున్నట్లు చూపించానని ఈ సినిమాలో గ్రామాల గురించి చూపించానని దర్శకులు చెప్పారు.  సినిమాలో అభివృద్ధికి దూరంగా ఉండే గ్రామాలు.. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు.. గురించి చెప్పినట్లు తెలిపారు. అందుకోసం అటువంటి గ్రామాలకు వెళ్లినట్లు చెప్పారు. పోలవరం నుంచి 40కిలోమీటర్లు సిగ్నల్ లేని ప్రాంతంలో టేకూరు అనే విలేజ్ లో సినిమా చేసినట్లు తెలిపారు.  
 
 
ప్రజల హృదయాలకు హత్తుకునేలా తీస్తే సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకులు అన్నారు. పాయల్ తీసుకోవడానికి రీజన్ ఏంటీ? అంటే ఆర్ఎక్స్ 100 సినిమా చూసిన తర్వాత ఆమె తన కథకు సరిగ్గా సరిపోతుంతని భావించానని, ఎవరైనా హీరోయిన్ దగ్గరకు ఇదే కథతో వెళ్తే ఫస్ట్ లైన్ విన్న తర్వాత హీరోయిన్ ఫస్ట్ గెట్ అవుట్ అని అంటారని కానీ, పాయల్ ధైర్యంగా క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుందని చెప్పారు.
 
 
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయలేమని.. కమర్షియల్ అయితే నాలుగు సినిమాలు చేయవచ్చునని ముందే కొందరు హీరోయిన్లు సినిమాకు ఒప్పుకోలేదని భాను శంకర్ చౌదరి చెప్పారు.
 
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే కాల్షీట్లు ఎక్కువ ఇవ్వాలని 70రోజులు డేట్లు అమ్ముకుంటే మూడు సినిమాలు తీసుకోవచ్చునని అన్నారంటూ దర్శకులు హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ నచ్చడంతో పాయల్  వెంటనే సినిమాకు ఒప్పుకుందని దర్శకుడు చెప్పారు.
 
 
సినిమా తీసిన తర్వాత ఈ సినిమాకు పాయల్ రాజపూత్ కంటే వేరే అమ్మాయిని ఊహించుకోలేం అని చెప్పారు భాను శంకర్. టీజర్ రిలీజ్ అయ్యాక బోల్డ్ గా ఉందంటూ కామెంట్లు వచ్చాయని, అప్పడు పాయల్ కాస్త భయపడిందని, కానీ జనం కామెంట్లకు బయపడితే ఎలా? ఆమెకు చెప్పినట్లు దర్శకులు చెప్పారు.
 
పాయల్ రాజపూత్ అనే అమ్మాయి, అనుష్క.. సౌందర్య లాంటి హీరోయిన్లు రేంజ్ కి వెళ్లే అమ్మాయి అని అన్నారు.
 
 
నా సినిమా అర్థనారికి నంది అవార్డులు వస్తే ఎవ్వరూ కూడా ప్రమోట్ చెయ్యలేదని ప్రమోషన్ కోసమే.. ఉద్ధేశపూర్వకంగా టీజర్ కట్ చేశామని దర్శకులు చెప్పారు.