మహాలక్ష్మి బి.ఏ చిత్రం లిరికల్ వీడియో 25 అక్టోబర్ విడుదల

Published On: October 21, 2020   |   Posted By:
మహాలక్ష్మి బి.ఏ చిత్రం లిరికల్ వీడియో 25 అక్టోబర్ విడుదల
 
వాస్తవ సంఘటనల ఆధారంగా మహాలక్ష్మి బి.ఏ
 
టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ బ్యానర్ పై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో ‘ఇప్పుడిప్పుడే’ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది.  రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు. 
 
నిర్మాత: రాజేష్
ఎడిటర్: దీపక్
కెమెరామెన్: లోకేష్
లిరిక్స్: ప్రభాకర్ దండు
దర్శకత్వం: రాజేష్