మొక్కలు నాటిన హీరోయిన్ మీనా

Published On: January 20, 2021   |   Posted By:
మొక్కలు నాటిన హీరోయిన్ మీనా
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ మీనా
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ , బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై సైదాపెట్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ మీనా.
 
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు.
 
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని, ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ  కన్నడ హీరో  సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.