రాక్ష‌సుడు మూవీ రివ్యూ

Published On: August 2, 2019   |   Posted By:

రాక్ష‌సుడు మూవీ రివ్యూ

థ్రిల్లైన ప్రేక్షకుడు  ( ‘రాక్షసుడు’ సినిమా  రివ్యూ)
 
Rating:3/5

తమిళంలో సూపర్ హిట్టైన  `రాక్షస‌న్‌`  రీమేక్  అనగానే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, కామెడీ లేదు తెలుగులో చూస్తారా అని కొందరు సందేహం వ్యక్తం చేసారు. కొందరు హీరోలు మేము చేయలేం..ఇలాంటి సినిమాలు చూడడానికి మాత్రమే బాగుంటాయని తప్పుకున్నారు.  ఇక బెల్లంకొడ స్టైయిట్ కథలతో చేసిన సినిమా ఏదీ ఆడటంలేదు. సర్లే రీమేక్ అయినా రాణిస్తామేమో అని ఎదురుచూస్తున్న సిట్యువేషన్. ఇలాంటి పరిస్దితుల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మరి తెలుగులో ఈ సినిమా వర్కవుట్ అవుతుందా…బెల్లంకొండకు హిట్ ఇస్తుందా…అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి
సినిమా డైరక్టర్  ప్రయత్నాల్లో ఉన్న అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) కుటుంబ పరిస్దితులతో   పోలీస్ డిపార్టమెంట్ లోకి వస్తాడు. ఇన్సిపెక్టర్ గా ఛార్జ్ తీసుకోగానే ఓ మర్డర్ కేసు ఇన్విస్టిగేషన్ కు వెల్లాల్సి వస్తుంది. అక్కడ ఆ మర్డర్ జరిగిన తీరు చూసి అది ఓ సైకో చేసాడని, ఇంతకు ముందు జరిగిన కొన్ని హత్యలకు లింక్ అప్ చేసి చూస్తాడు.  కేవలం  స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలనే ఆ సైకో టార్గెట్ చేస్తున్నాడని అర్దం చేసుకుంటాడు.  డిపార్టమెంట్ మొదట నమ్మదు..నీ సినిమా తెలివి తేటలు ఇక్కడ చూపించకు అని మందలిస్తుంది. కానీ మరో హత్య …అదీ అరుణ్ చెప్పిన రీతిలోనే ..అలాంటి క్లూలతోనే జరిగేసరికి షాక్ అవుతారు.

ఈ లోగా ఈ కేసు మరింత వేడిక్కటానికి అన్నట్లుగా అరుణ్ మేనకోడలుని హత్య కు గురి అవుతుంది. దాంతో తట్టుకోలేకపోయిన అరుణ్ ఇన్విస్టిగేషన్ ముమ్మరం చేస్తారు. ఈ లోగా డిపార్టమెంట్ లో ఉన్న ఓ మహిళా అధికారిణి ఇగో తో అరుణ్ సస్పెండ్ అవుతాడు. అయినా సరే తన ఇన్విస్టిగేషన్ ఆపడు. సైకో పూర్తి వివరాలు లాగుతాడు. అప్పుడు ఏం జరిగింది.  సైకోని తన దగ్గరున్న  క్లూలతో  ఎలా పట్టుకోలగలిగాడు…ఇంతకీ ఆ సైకో ఎవరు..అసలు అతను పనిగట్టుకుని   స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలనే ఎందుకు చంపుతున్నాడు అనే విషయాలు తెరపై చూసి తీరాల్సిందే.

ప్ల స్ లు..మైనస్ లు

ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ గా సాగే ఈ కథలో ఒక్కో క్లూ హీరో ఛేదించుకుంటూ ముందుకు వెల్లటం ఆసక్తికరంగా ఉంటుంది. ఆడపిల్లలను నిర్దాక్ష్యణంగా చంపే ఆ సైకోని చంపేయాలన్నత కసిని మనలో ఇంజెక్ట్ చేస్తారు. దాంతో హీరోతో మనం మమేకమై సినిమాని ఫాలో అయ్యి సైకోని మనమే పట్టుకుని చంపామన్న ఆనందం ఫీలవుతాం. అదంతా ఈ సినిమా ఒరిజనల్ తమిళ రచయతల గొప్పతనం. ఎందుకంటే తెలుగుకు ఒక్క అక్షరం, ఒక్క ఫ్రేమ్ కానీ మార్చకుండా సీన్ బై సీన్ తీసుకుంటూ వెళ్లారు. అలాగే సైకోని పట్టుకునే క్రమంలో వచ్చే ట్విస్ట్ లు కూడా బాగా అలరిస్తాయి. స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు హైలెట్. నేటివిటీ పేరుతో దర్శకుడు దాన్ని మార్చాలనుకోకపోవటం అదృష్టం. అయితే అంతా బాగా చేసినా ..చివర్లో   సైకో  రివీల్ అయ్యిపోయాక మాత్రం ఇంకా సినిమాని సాగతీస్తూ కథని నడపటం మాత్రం అప్పటిదాకా  పెంచిన టెంపోనే స్వయంగా డైరక్టర్ పడేసినట్లు అయ్యింది. చివర్లో ఫైట్ అయితే విసుగిస్తుంది.

  సాంకితికంగా
ఈ సినిమాకు టెక్నికల్ గా మంచి అవుట్ ఫుట్ ని టీమ్ ఇచ్చింది. ప్రతీ ఒక్కరూ సినిమాకు ప్లస్ అయ్యిన వాళ్లే. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్  స్కోర్, కెమెరా వర్క్ మాత్రం కేక పెట్టించింది. ఇక ఆర్టిస్ట్ లలో బెల్లంకొండ శ్రీని వాస్ మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. పాత్రకు తగ్గట్లుగా బాడీ ఉంది కానీ  ముఖంలో మాత్రం ఎక్సప్రెషన్స్ కరువు అయ్యాయి.  హీరోయిన్ గురించి మాట్లాడటానికి ఆమెకు కథలో ఉన్న విషయం, సీన్స్ తక్కువ. మిగతావాళ్లంతా తమిళ ఒరిజనల్ లో ఉన్నవాళ్లే.  కీలకమైన క్రిస్టోఫర్‌ పాత్రలో శరవణన్‌  జీవించాడు. అతనే మొత్తం స్క్రీన్ స్పేస్ ని లాగేసుకున్నాడు.

ఇక డైరక్షన్ విషయానకి వస్తే రమేష్ వర్మ ..రీమేక్ ని మక్కికి మక్కి దించటంతో పెద్దగా మాట్లాడుకునేందుకు ఏమీ మిగల్చలేదు. డైలాగులు ..సినిమా లో ఇమిడిపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
చూడచ్చా
ఖచ్చితంగా ఎంగేజ్ చేసే సినిమా ఇది.  

తెర వెనక ..ముందు

సంస్థ‌: ఎ హ‌వీష్ ప్రొడ‌క్షన్‌
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్‌,  రాజీవ్ క‌న‌కాల‌, కాశీ విశ్వనాథ్ త‌దిత‌రులు
సంగీతం: జిబ్ర‌ాన్‌
మాట‌లు: సాగ‌ర్‌
క‌థ – స్క్రీన్‌ప్లే: రామ్‌కుమార్‌
కెమెరా: వెంక‌ట్‌.సి.దిలీప్‌
ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఎడిట‌ర్‌: అమ‌ర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: కొడాలి ముర‌ళీకృష్ణ‌
ఫైట్స్: వెంక‌ట్ – విక్కీ
క్రియేటివ్ హెడ్‌: పూర్ణ కాండ్రు
పాట‌లు: చంద్ర‌బోస్‌, శ్రీమ‌ణి, రాకేందుమౌళి, వెన్నెల‌కంటి
ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ పెన్మెత్స‌
నిర్మాత‌: కోనేరు స‌త్యనారాయ‌ణ‌