రాగల 24 గంటల్లో చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

Published On: September 3, 2019   |   Posted By:

రాగల 24 గంటల్లో చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

రాగల 24 గంటల్లో టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌…

నేను ఇంక మద్రాసులో ఉండలేను, సినిమా ఇండస్ట్రీనుండి వెళ్లిపోతాను అనుకున్నప్పుడు నన్ను ఓ మిత్రుడు వెళ్లకుండా ఆపాడు. నువ్వు ఇక్కడ ఉండు చాలా సాధించగలవు అనే నమ్మకాన్ని నాలో నింపాడతను.  ఆతనే శ్రీనివాసరెడ్డి అన్నారు వీవీ వినాయక్‌.

శ్రీనవ్‌హాస్‌ క్రియోషన్స్, శ్రీకార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఇషారెబ్బా, సత్యదేవ్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని  శ్రీనివాస్‌ కానూరి నిర్మించగా శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు.
 
వినాయక చవితి సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రముఖ దర్శకుడు వినాయక్‌ చేతులమీదుగా  టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ–‘ ఈ చిత్ర టైటిల్‌ చాలా బావుంది. వినగానే మన చిన్నప్పుడు రేడియేలో వచ్చే వాయిస్‌ గుర్తుకొచ్చింది. శ్రీనివాసరెడ్డి చాలా మంచి దర్శకుడు. మంచి మనిషి.  ఓ మంచి స్క్రిప్ట్‌ దొరికితే సినిమా ఎంత బాగా తీస్తాడో ‘ఢమరుకం’ చిత్రంతో ఫ్రూవ్‌ చేసుకున్నాడు.  ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. సినిమా పెద్ద విజయం సాధించి నిర్మాత శ్రీనివాస్‌ గారికి పెద్ద పేరుతో పాటు లాభాలు రావాలని కోరుకుంటున్నాను. సంగీత దర్శకుడు రఘు కుంచె మ్యూజిక్‌ చాలా బావుంటుంది. ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు చక్కని అవకాశం ఉంటుంది’ అన్నారు.
 
దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ–‘ వినాయక్‌ గారి అమృత హస్తాలతో మా సినిమా మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయటం ఆనంధంగా ఉంది. గతంలో నా అన్ని చిత్రాలు ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌’, ప్రతి చిత్రానికి ఫస్ట్‌లుక్‌ కానీ, ఆడియో గాని ఆయన చేతుల మీదుగా జరుపుకోవటం నాకు ఆనవాయితీ. మా నిర్మాత శ్రీనివాస్‌ గారు నాకు ఏది కావాలంటే అది ఇచ్చి మంచి అవుట్‌పుట్‌ రావాటానికి కారకులయ్యరు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నా’ అన్నారు.
 
శ్రీనివాస్‌ కానూరి మాట్లాడుతూ ‘ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి సినిమా తీశావని అందరి మెప్పు పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
శ్రీరామ్, గణేశ్‌ రాఘవేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ‘గురుడవేగ’ ఫేమ్‌ అంజి కెమెరామెన్‌. ఎడిటర్‌– తమ్మిరాజు, మాటలు– కృష్ణభగవాన్, సంగీతం– రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– అలీబాబా