విధిలిఖితం మోషన్ పోస్టర్ విడుద‌ల

Published On: September 11, 2020   |   Posted By:
విధిలిఖితం మోషన్ పోస్టర్ విడుద‌ల‌
 
శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రోడ‌క్ష‌న్స్ “విధిలిఖితం” మోషన్  పోస్టర్ విడుద‌ల‌
 
శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రోడక్ష‌న్స్ బ్యాన‌ర్ లో సోషియో ఫాంట‌సి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా నిర్మాత పాండు నిర్మాణం లో ఎమ్ లోచ‌న్ ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం “విధిలిఖితం”. ఈ చిత్రం లో శ‌శాంక్ మంగు, భ‌వ్య‌శ్రీ హీరోహీరోయిన్స్ గా చేస్తుండ‌గా అతి ముఖ్య‌మైన పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు సూర్య‌కుమార్ భ‌గ‌వాన్ దాస్ న‌టిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ కాన్సెప్ట్ తో ఆధ్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపోందించిన ఈ చిత్రం యెక్క మెష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసారు. ఈ పోస్ట‌ర్ చూసిన వారంతా కొత్త గా ఫీల్ అవ‌టం చిత్ర యూనిట్ కి చాలా ఆనందం క‌లిగించింది. 
 
ఈ సంద‌ర్బంగా నిర్మా‌త పాండు మాట్లాడుతూ.. రెగ్యుల‌ర్ చిత్రాలు తీస్తే చూసే ప‌రిస్థితి ఇప్ప‌డు లేదు. ఒక కొత్త పాయింట్ తో సినిమా తీయ‌క‌పోతే ఈ కాంపిటేష‌న్ లో వుండ‌టం క‌ష్టం గా వుంది. డైర‌క్ట‌ర్ ఎమ్ లోచ‌న్ చెప్పిన క‌థ చాలా కొత్త‌గా వుంది. అలానే థ్రిల్లింగ్ గా వుంది. సూర్య గారు పాత్ర చిత్రానికి కీ పాత్ర అవుతుంది. అలాగే ఈ చిత్రానికి వికాశ్ కురుమెళ్ళ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్మి శ్రీనివాస్ కంతేటి, రామ‌కృష్ణ ప‌రిటాల మాట‌లు అందించారు. శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. మెము విడుద‌ల చేసిన “విధిలిఖితం” మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి పేరు రావ‌టం యూనిట్ అంతా ఉత్సాహంగా వున్నారు. అని అన్నారు.
 
న‌టీన‌టులు.. శ‌శాంక్ మంగు, భ‌వ్య‌శ్రీ, సూర్య‌కుమార్ భ‌గ‌వాన్‌దాస్ త‌దిత‌రులు..
 
బ్యాన‌ర్.. శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రోడ‌క్ష‌న్స్‌
నిర్మాత.. పాండు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం.. ఎమ్ లొచ‌న్‌
సంగీతం.. వికాశ్ కురుమెళ్ళ‌
సినిమాటోగ్ర‌ఫి.. నాగేంద్ర కుమార్ మోతుకూరి
ఫైట్ మాస్ట‌ర్‌.. ష‌యోలిన్ మల్లేష్‌
మాట‌లు.. ల‌క్ష్మి శ్రీనివాస్ కంతేటి, రామ‌కృష్ణ ప‌రిటాల
లిరిక్స్‌.. రామాంజ‌నేయులు
కొరియోగ్రఫి.. చంద్ర‌కిర‌ణ్‌