వి మూవీ ఉగాది విడుద‌ల‌

Published On: November 5, 2019   |   Posted By:
వి మూవీ ఉగాది విడుద‌ల‌
 
 
ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల‌వుతున్న  నేచుర‌ల్ స్టార్ నాని , సుధీర్‌బాబు, శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ , మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్ వి`
 
నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `వి`. “ఈ క్షణం నుంచి నా శత్రువులకి  నా దయా దాక్షిణ్యాలే దిక్కు“ ట్యాగ్ లైన్‌. హీరో  నాని 25వ చిత్ర‌మిది.నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ నిర్మాత‌లుగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేస్తున్నారు ఈ సంద‌ర్భంగా …
నిర్మాతలు శిరీష్‌,ల‌క్ష్మ‌ణ్‌,హ‌ర్షిత్ మాట్లాడుతూ “నాని 25వ చిత్రం మా బ్యాన‌ర్‌లో రూపొందుతుండ‌టం ఆనందంగా ఉంది. అలాగే సుధీర్‌బాబుగారు, నివేదా థామ‌స్‌, అదితిరావుగారి కాంబినేష్ కుదిరింది. ఈ చిత్రంలో నాని మరియు సుధీర్ బాబు పోటా పోటీగా నటించారు.   మోహనకృష్ణ‌గారు స‌మ్మోహ‌నం వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. 80 శాతం చిత్రీక‌రణ పూర్త‌య్యింది. రెండు ఫైట్స్, ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నానిగారు చూడ‌ని ఓ కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఉగాది సంద‌ర్భంగా సినిమాను మార్చి 25న విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు. 
 
న‌టీన‌టులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి త‌దిత‌రులు 
 
సాంకేతిక వ‌ర్గం:
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ:  పి.జి.విందా
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
నిర్మాత‌లు:  శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్‌
ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి