వి మూవీ రివ్యూ

Published On: September 5, 2020   |   Posted By:

వి మూవీ రివ్యూ

నాని  ‘వి’ రివ్యూ

Rating:2.5/5

థియోటర్స్  లో విడుదల కష్టమనిపించే సినిమాలే ఎక్కువగా ఓటీటిలలో రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గ రిజల్ట్ నే ఈ సినిమాలు సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ తరహా సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ. అయితే ఇప్పుడు మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న ‘వి’  సినిమా రిలీజ్ అయ్యింది. ఇంద్రగంటి, నానిల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్, దిల్ రాజు వంటి నిర్మాత ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ వంటి అంశాలు కూడా సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచడంలో తమదైన  కీలక పాత్రను పోషించాయి. ఇక నాని నటించిన 25వ చిత్రం కావడంతో పాటు.. నాని నెగటివ్ షేడ్ చేస్తున్నాడనే ప్రచారం కూడా హైప్ క్రియేట్ చేయడంలో బాగా పనిచేసింది. మరి ఈ ఎక్సపెక్టేషన్స్ ను సినిమా అందుకుందా? అసలు ఈ సినిమా కథేంటి, ఓటీటి సినిమాల్లో ఇదో సెన్సేషన్ ప్రాజెక్టుగా మిగులుతుందా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్..

ఇదో పోలీస్ అధికారికి, వరస హత్యలు చేస్తున్న హంతకుడుకి మధ్య జరిగే వార్ లాంటి కథ. డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) ఎంతటి సాహసమైనా చేసి కేసును ఛేధించే హిస్టరీ ఉన్న  పేరున్న పోలీస్ ఆఫీసర్. తన కెరీర్లో ఎన్నో మెడల్స్ సాధించి సాఫీగా ,కూల్ గా సాగిపోతున్న అతని లైఫ్ లోకి ఓ క్రిమినల్ (నాని) ఎంటరవుతాడు. తమ డిపార్టమెంట్ కు చెందిన ఓ పోలీస్ అధికారి హత్య ఆదిత్యను కలవరపరుస్తుంది. ఎందుకంటే ఆ కిల్లర్…ఆదిత్యకు డైరక్ట్ సవాల్ వదులుతాడు.
చేతనైతే తనని పట్టుకోవాలని లేకపోతే తన మెడల్స్ తిరిగి ఇచ్చి తన జాబ్ కు రాజీనామా ఇవ్వాలని ఓపెన్ చాలెంజ్ చేస్తాడు. దాంతో ఈ కేసు విషయంలో ఆదిత్య కు ఒత్తిడిపెరుగుతుంది.

ఆదిత్య కిల్లర్ ను పట్టుకోవాలని శతవిధాలుగా ట్రై చేస్తుంటే అంతనికే ఫోన్ చేస్తూ ఛాలెంజ్ విసురుతూ దొరక్కండా ఈ  కిల్లర్ ఇంకో ఇద్దరినీ కూడా చంపుతాడు. ఏం చెయ్యాలో అర్దంకాని సిట్యువేషన్ లో ఉండగా ఆ కిల్లర్ గురించిన ఓ కీలకమైన సమాచారం తెలుస్తుంది. దాంతో తన ఇన్విస్టేషన్ దిసను మారుస్తాడు. కేసుని తవ్వటం మొదలెడతాడు. ఈ క్రమంలో ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు అతనికి తెలుస్తాయి. అసలు ఆ కిల్లర్ ఎందుకు ఆ మర్డర్స్ చేస్తున్నాడు, అతని గతం ఏంటి? కిల్లర్ ని విష్ణును  పట్టుకున్నాడా? చివరికి ఏం జరిగింది అనేదే మిగతా కథ.

స్క్రీన్ ప్లే సంగతులు

ఈ కథను ఇంద్రగంటి చాలా రొటీన్ గా తయారు చేసుకున్నారని మనకు సినిమా ప్రారంభమైన పదో నిముషంలోనే అర్దమైపోతుంది. ఓ కిల్లర్…అతను హత్యలు చేస్తూంటే పోలీస్ లు వెంటబడతారు. అయితే ఆ కిల్లర్ కు ఓ బాధాకరమైన ప్లాష్ బ్యాక్. అందుకే అతను పగ తీర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ పగ, ప్రతీకారం మార్క్ కథని ఓ సైక్ కిల్లర్ థ్రిల్లర్ అన్నట్లు పబ్లిసిటీ చేసి, సినిమాపై ఆసక్తి కలగ చేసారు. కానీ సినిమా ఆ దిశగా నడవదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో..ఇక్కడే అవే సమస్యలు. కాంప్లిక్ట్ దిసగా కథ ఎస్టాబ్లిష్ కాదు. నెగిటివ్ పాత్రలతో హీరో తలపడితేనే సినిమాలో మజా.

ఇక్కడ నెగిటివ్ పాత్రలు ఉంటాయి కానీ అవి పరిచయం అయిన మరుక్షణంలో చనిపోతాయి. అలా కాకుండా ఆ నెగిటివ్ పాత్రలు తిరగబడి నాని పాత్రను ఆ మర్డర్స్ చేయకుండా ఆపగలిగే ప్రయత్నం చేస్తే, అయినా సరే నాని ఆ వలయం నుంచి తప్పించుకోగలిగితే సినిమాలో కిక్ ఉంటుంది. అది ఇక్కడ జరగలేదు. దాంతో చాలా ప్లాట్ గా నేరేషన్ తయారైంది. ఇక ప్లాష్ బ్యాక్ ఏదో అధ్బుతంగా ఉంటుందేమో అనుకుంటే..లక్షా తొంభై సినిమాల్లో చూసిందే..తన లవర్ ని చంపేసిన వాళ్లపై పగ తీర్చుకోవటం. థ్రిల్లర్స్ క్లైమాక్స్ లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ అది కూడా లేదు. కథా పరంగా ఓ ట్విస్ట్ అనుకున్నారు కానీ అది పేలలేదు. టోటల్ గా ఈ సినిమా కథ,కథన పరంగా సరిగ్గా రాసుకోకపోవటం వల్ల ఇబ్బందులు వచ్చాయి.

దర్శకత్వం,మిగతా విభాగాలు

దర్శకుడుగా ఇంద్రగంటి కథ విషయంలో దెబ్బ తిన్నాడే కానీ, ఫ్రేమింగ్,నటీనటుల చేత నటింపచేయటం వంటి విషయాల్లో తన నైపుణ్యం ప్రదర్శించాడు. ఇక డైలాగులు సైతం తన గత చిత్రాల్లోగానే బాగా రాసుకున్నాడు.  పి. జి. వింద సినిమాటోగ్రఫీ సినిమాకు నిండుతనం తెచ్చింది. అమిత్ త్రివేది పాటలు సోసో.  తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ… సూపర్ హిట్ రాక్షసన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గుర్తు చేస్తుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

చూడచ్చా?

నాని నటించిన సినిమా కాబట్టి ఓ లుక్కేయచ్చు..అయితే ఎక్సపెక్టేషన్స్ లేకుండా
 
తెర ముందు..వెనక

బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు:   నాని, సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, రోహిణి, హ‌రీశ్ ఉత్త‌మ‌న్‌, మ‌ధుసూద‌న్ రావు, వెన్నెల‌కిషోర్ త‌దితరులు
సంగీతం:  అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సౌండ్ డిజైన్‌:  బిశ్వ‌దీప్ చ‌ట‌ర్జీ
కెమెరా:  పి.జి.విందా
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీశ్, హ‌ర్షిత్ రెడ్డి
రన్ టైమ్: 140 నిముషాలు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి
విడుదల తేదీ: సెప్టెంబర్‍ 5, 2020
 విడుద‌ల‌: అమెజాన్ ప్రైమ్‌