శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఆగస్ట్ 27 విడుదల

Published On: August 19, 2021   |   Posted By:
 
శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఆగస్ట్ 27 విడుదల
 
 
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. 
 
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది శ్రీదేవి సోడా సెంటర్. తమ సినిమా ప్రేక్షకులను అలరిం చడం ఖాయం అంటున్నారు మేకర్స్. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమా టో గ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు:
సుధీర్ బాబు, ఆనంది తదితరులు..

టెక్నికల్ టీం:
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: మణిశర్మ