సమంత చిత్రం ఊర్వశి ఓటిటి లో

Published On: March 10, 2021   |   Posted By:
సమంత చిత్రం ఊర్వశి ఓటిటి లో
 
ఊర్వశి’తో జత కట్టిన “సమంత”
 
హిప్నాటిజం నేపథ్యంలో  హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “సమంత”.
 
ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిరి కనకన్ అనే  ముద్దుగుమ్మ టైటిల్ రోల్ పోషించగా, లిరిన్, రమేష్ నీల్, చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు. 
     
ఇప్పటికే పలు ఇండియన్- ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎంపికైన ఈ చిత్రం “ఊర్వశి ఓటిటి” ద్వారా మార్చ్ 6 నుంచి ఉర్రూతలూగింలించు తోంది.
 
ఆద్యంతం అత్యంత ఆసక్తికర కథనంతో రూపొందిన “సమంత” చిత్రం దర్శకుడిగా తనకు మంచి పేరు తీసుకురావడంతోపాటు.. ఇందులో నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ముఖేష్ కుమార్ ఆశాభావం వక్తం చేశారు.
     
ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్.ఎ. ప్రసాద్, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, కెమెరా: అశోక్ రత్నం, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ, రచన-ఆలోచన-దృశ్యరూపం:
ముఖేష్ కుమార్!!