సాహో మూవీ రివ్యూ

Published On: August 30, 2019   |   Posted By:
సాహో మూవీ రివ్యూ
 
ఆహా అనిపించలేదు…( `సాహో` రివ్యూ)
 
Rating: 2/5 

ఒకే ఒక్క సినిమా డైరక్ట్ చేసిన కుర్రాడికి ‘బాహుబలి’తో  పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ సినిమా డైరక్షన్ ఛాన్స్ ఇవ్వటమా… అంత గొప్పగా ప్రభాస్ కు ఏం చెప్పి  ఇంప్రెస్ చేసాడు ఇది సినిమావాళ్లకు సహజంగా ఉండే కుతూహలంగా ఉండే ఇంట్రస్ట్, బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమా అంటే ఎన్నో లెక్కలు, అంచనాలు. వాటికి సరితూగుతుందని చేసిన `సాహో` లో ఏముంది…ఇది సిని లవర్స్ మదిలో ప్రశ్నలు. ప్రభాస్ కొత్త సినిమా బాహుబలిని దాటేస్తుందా ఇది ఫ్యాన్స్ బెట్టింగ్ కాసేటంత నమ్మకంతో కూడిన డౌట్. వీటిన్నటికీ సమాధానంగా ఈ రోజు  `సాహో` థియోటర్స్ లో దిగింది. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది,కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
  
 కథేంటి 
 
ముంబయిలో ఓ తెలివైన దొంగ చాలా తెలివితేటలతో  రూ. రెండు వేల కోట్ల దొంగతనం చేస్తాడు. ఇన్విస్టిగేట్ చేయటానికి ఒక్క క్లూ కూడా దొరక్కపోవటంతో పోలీస్ డిపార్టమెంట్ చేతులు ఎత్తేస్తుంది. అప్పుడా దొంగతనం సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. ఆ దొంగను పట్టేందుకు తన తెలివి తేటలు వాడి క్లూలు కొన్ని ఛేధిస్తాడు. అయితే సాక్ష్యాదారాలు ఏమీ లేకపోవటంతో  ఆ దొంగ దొరికినా అరెస్ట్ చేయలే అని, రెడ్ హ్యాండెండ్ గా పట్టుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)కూడా అతనికి కలుస్తుంది. ఇన్విస్టిగేషన్ తో పాటు ఖాళీ టైమ్ లో ఇద్దరూ ప్రేమలో పడి డ్యూయిట్స్ గట్రా పాడుకుంటూంటారు. ఇక దొంగను పట్టుకుంటామని అనుకుంటూండంగా ఆ దొంగ ద్వారా అశోక్ కు ఓ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ దొంగ తాను త్వరలో బ్లాక్ భాక్స్ ని దొంగిలించబోతున్నట్లు చెప్తాడు. ఆ దొంగతనం చేసేటప్పుడే  రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుందామని అశోక్ ఫిక్స్ అవుతారు. కానీ ఆ బ్లాక్ భాక్స్  కోసం చాలా మంది గ్యాంగస్టర్స్ ట్రై చేస్తున్నారని తర్వాత తెలుస్తుంది. అప్పుడు అశోక్ ఏం చేసాడు. అసలు సాహో ఎవరు, అశోక్‌ చక్రవర్తి – అమృతా నాయర్‌ ప్రేమ కథ ఏమైంది,వాజీ సిటీకి ఈ కథ కు సంభందం ఏమిటి  అనేదే అసలు కథ.

ట్విస్ట్ లు ఇచ్చిన ట్విస్ట్

సాహో సినిమా అన్ని విధాలుగా నిరాశపరిచిందనే చెప్పాలి. కొన్ని ట్విస్ట్ లు, మరికొన్నియాక్షన్ సీన్స్ తో నడిపేద్దామనుకున్న ఈ థ్రిల్లర్ కన్ఫూజింగ్ స్క్రీన్ ప్లేతో దెబ్బతింది. ప్రభాస్ ఇమేజ్ ని, ప్రభాస్ స్టామినా వాడకుండా కేవలం తను నమ్మిన కొన్నిట్విస్ట్ లతో పండింద్దామనుకున్నాడు. ఇలాంటి ట్విస్ట్ బేసెడ్ కథలు చిన్న హీరోలకు సుఖంగా ఉంటాయి కానీ ప్రభాస్ లాంటి వాళ్లకు సరిపడవు. అసలు ప్రభాస్ ఎవరో..అతని ఎమోషన్ ఏమటో సినిమా చివరదాకా చెప్పకుండా దాచిపెడ్తే…అతనితో ఎలా చూసేవాళ్లు జర్నీ చేస్తారు అనే మినిమం సెన్స్ కూడా ఈ స్క్రిప్టులో లేకపోవటం విచారకరం. దాంతో ఈ సినిమా హీరో ఏం చేసినా మనకు ఏమీ అనిపించదు. ఫైట్ చేసినా ఇంకా కొట్టు అని అరవాలనిపించదు. ఎందుకంటే హీరో మంచోడో, చెడ్డోడో, ఏ మిషన్ మీద అతను తిరుగుతున్నాడనే క్లారిటీ అసలు ఉండదు. ఫస్టాఫ్ ఏదో మమ అనిపించి, ఇంటర్వెల్ దగ్గర బాగుందనిపించుకున్నా, సెకండాఫ్ కు వచ్చేసరికి విరక్తి పుడుతుంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో డైరక్టర్ కు కూడా అవగాహనలేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ సైతం తేలిపోయింది అందరూ ఊహించగలిగే ట్విస్ట్ తో. దాంతో చాలా భాగం మన సహనానికి పరీక్ష అనిపిస్తుంది. 

కన్ఫూజన్..కన్ఫూజన్

ఈ సినిమాలో ప్రధాన లోపం కథ ,స్క్రీన్ ప్లే, ఫైట్స్ అన్ని విషయాల్లోనూ కన్ఫూజన్. ఏం జరుగుతోందో తెరపై మనకు అర్దంకానివ్వకుండా అస్తమానం డైరక్టర్ తన ప్రతిభతో అడ్డు పడుతూంటాడు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్ చూపెడతాడు..ఎవరితో చేస్తున్నాడో తెలియదు. దాంతో ఆ ఫైట్ ని ఎంజాయ్ చేయలేం. అలాగే ఓ ఫన్ సీన్ ఉన్నా..దాన్ని ప్రొసీడింగ్స్ తో బోర్ కొట్టిస్తాడు. ఇక క్లైమాక్స్ భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే…హీరో ఫైట్ చేస్తూంటే…వేరో చోట వేరే సీన్స్ మధ్యలో ఇరికించి చూపెడుతూంటాడు. అంతా కన్ఫూజన్ గా చేసేస్తాడు. 

ఏం బాగున్నాయి

ఈ సినిమాలో చెప్పుకోదగినవి ఇంట్రవెల్ ట్విస్ట్, హాలీవుడ్ స్దాయి ఫైట్స్,  జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌ ‘బ్యాడ్‌ బాయ్‌…’ సాంగ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ప్రొడక్షన్ వాల్యూస్

ఏం బాగోలేదు

ఎప్పుడు చూసినా తెర నిండా  బాలీవుడ్ విలన్లు, ఇంగ్లిష్‌ రౌడీలతో  నిండిపోతే మనం తెలుగు సినిమా చూస్తున్నామా అనే డౌట్ వచ్చినప్పుడు. అలాగే సినిమాలో ఎమోషన్ కంటెంట్ లేకుండా సీన్స్ నడుస్తున్నప్పుడు. 

ఎవరు బాగా చేసారు

సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ లీడర్ గా చుంకీపాండే అదరకొట్టాడు. డాన్‌ లుక్‌లో తన మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్, శ్రద్దాకపూర్ సినిమాని మొత్తం మోసారు.
 
సాంకేతికంగా … 
 
ఈ సినిమాకు సంభందించి  టెక్నీషియన్స్ లో టాప్ ప్లేస్ హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు కెన్నీ బట్స్‌, రామ్ లక్ష్మణ్‌ లకు ఇవ్వాలి. వారి కష్టమే అడుగడుగునా కనపడుతుంది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు జస్ట్ ఓకే. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకు ఉన్నంతలో ప్లస్. అలాగే సినిమాని రిచ్ గా చూపెడట్టడంలో సినిమాటోగ్రాఫర్‌ మది కష్టం కనపడుతుంది. దర్శకుడుగా సుజీత్ నటీనటులు నుంచి, టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు. 
 
చూడచ్చా
మీరు ప్రభాస్ అభిమాని అయితే ..నచ్చే అవకాసం ఉంది

ఆఖరి మాట

అంత చిన్న వయస్సులో అంత పెద్ద స్టార్ ని డైరక్షన్ చేసే అవకాసం పాడుచేసుకున్నాడు

ఎవరెవరు..
 
నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, ఎవ్లీన్‌ శర్మ, మందిరా బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది; 
సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)
కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌; 
నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌; 
కథ, దర్శకత్వం: సుజీత్‌; 
విడుదల తేదీ: 30-08-2019