సుబ్రమణ్యపురం రివ్యూ

Published On: December 7, 2018   |   Posted By:

రిలీజ్ రోజే  సినిమా  చూడాలి అని  క్రేజ్ తెచ్చుకునే సినిమాలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు సినిమాలు కాకుండా సామాన్య హీరోల సినిమాలకు అంత సీన్ ఉండటం లేదు. ఏదో హాట్ స్టఫ్ ఉంటే కొద్దిలో కొద్ది ఓపినింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో సుమంత్ …ఈ ‘సుబ్రమణ్యపురం’ కు స్టఫ్ ఉన్న సినిమా అనిపించుకుని …చూడాలనే ఆసక్తి రేపగలిగాడు. ఇదో ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్..క్రౌడ్ ఫుల్లర్ అనిపించుకుని…జనాలను థియోటర్ కు రప్పించాడు. అయితే నిజంగానే సినిమాలో అంత స్టఫ్ ఉందా..కేవలం ట్రైలర్ కే అది పరిమితం అయ్యిందా…అసలు కథేంటి..నిఖిల్ సినిమాతో పోలిక అంటున్నారు …అలాంటిదేమన్నా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ ఇదే
గత కొంతకాలంగా సుబ్రమణ్యపురం సూసైడ్స్ అడ్డాగా మారుతుంది. ఆ ఊళ్లో ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయం వల్లనే ఈ ఆత్మహత్యలు అని అంతా అనుమానిస్తూంటారు. దానికి తోడు ఆ ఆత్మహత్యలు జరగటానికి ముందు ఆయన వాహనమైన  ఓ నెమలి వచ్చి అక్కడ వాలుతుంది. పోలీస్ లు సైతం ఈ ఆత్మహత్యలను ఆపటానికి ప్రయత్నించి చేతులెత్తేస్తారు. అప్పుడు మన హీరో కార్తీక్ (సుమంత్) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఎవరా కార్తీక్ అంటే…ఓ హేతువాది.  
కార్తీక్  పురాతన దేవాలయాలపై రీసెర్చ్ చేస్తూంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఈషా రెబ్బ. ఆమె కూడా అతనితోనే కలిసి తిరుగుతుంది. అతనికి ఈ దేవాలయం గురించి, ఈ ఊళ్లో సూసైడ్స్ గురించి తెలుస్తుంది. దాంతో ఆ ఊళ్లో వాలిపోయి..ఈ సూసైడ్స్ వెనక ఉన్న మిస్టరీని ఛేదిద్దామనుకుంటాడు. కానీ అతనికి చాలా శక్తులు అడ్డుపడతాయి.
 వాటితో పోరాటం చేస్తూ ఒక్కో ముడి విప్పే కొలిది ఒక్కో విషయం రివీల్ అవుతుంది. అసలు ఈ సూసైడ్స్ వెనక ఉన్న విషయం తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆ విషయం ఏమిటి…ఈ సూసైడ్స్ వెనక ఉన్నది దైవ శక్తా లేక..మానవ ఆసక్తా వంటి విషయాలుతో కూడిన మిస్టరీ వీడాలంటే మీరు సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది
సినిమాకు టీజర్, ట్రైలర్ తో క్రేజ్ తేవచ్చు కానీ నిలబెట్టడం మాత్రం కంటెంట్ ఉంటేనే సాధ్యం. ఈ విషయం సినిమావాళ్లకు తెలియంది కాదు. కానీ వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. లిప్ లాక్ ఉంటే కలిసొస్తుందని కొందరు నమ్మితే..ఫలానా సినిమాలా మన సినిమా ఉంటే హిట్ అయ్యిపోతుందని మరికొందరు ప్లాన్ చేస్తూంటారు. ఆ మధ్యన వచ్చి హిట్టైన నిఖిల్ ..కార్తికేయ సినిమా చూసిన తర్వాత వచ్చిన ఐడియానో ఏమో కానీ ‘సుబ్రమణ్యపురం’ కొంచెం అటూ ఇటూలో అలాగే ఉంటుంది. అయితే అటూ,ఇటో ఉంటే ఉపయోగమేంటి..ఫెరఫెక్ట్ గా ఉంటేనే చిన్న సినిమాకు పెద్ద లాభం. బొమ్మ  ఫరవాలేదన్నా కలిసొచ్చేదేమీ ఉండదు. 
మిస్టరీ ఎలిమెంట్స్ ని నమ్ముకుని తీసిన ఈ సినిమాలో అవి సరిగ్గా పే ఆఫ్ కాకపోవటం దెబ్బ కొట్టింది. దానికి తోడు స్క్రీన్ ప్లే సైతం కలిసి రాలేదు. ఫస్టాఫ్ మొత్తం సెటప్ ( కేవలం సూసైడ్స్, హీరో ఎంట్రీ)కే సరిపోయింది. దాంతో సినిమా సరైన కాంప్లిక్ట్ లోకి ఎంటర్ కాకపోవటంతో బోర్ వచ్చేసింది. సెకండాఫ్ లో ఏమన్నా అద్బుతం జరుగుతుందా అంటే మరీ అథోగతి అయ్యిపోయింది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకున్నారు. అప్పుడు కానీ అసలు నెగిటివ్ పాత్ర ఏమిటనేది రివీల్ కాదు. అప్పటిదాకా ఓపిగ్గా కథను చూడాలి. 
థ్రిల్లర్ సినిమాలు అంతేగా క్లైమాక్స్ లో ట్విస్ట్ ని బట్టే నిలబడతాయి అనుకుంటే …ఆ ట్విస్ట్ కు సంభందించిన ఎలిమెంట్స్, వేరేయేషన్స్ సినిమా అంతా కనపడాయి. అనగనగా ఓ రోజు సినిమాలాగ పూర్తి టైట్ సీన్స్ ఉండాలి. అసలు విషయం రివీల్ అయ్యేదాకా ఏదో కొత్త విషయం చూస్తున్న అనుభూతి రావాలి. ఈ సినిమాలో అలాంటిదేమీ లేదు. చాలా ప్లాట్ గా నడుస్తుంది. డైరక్టర్ కు రచన,దర్శకత్వంలో రెండింటిలోనూ విఫలమయ్యాడని తెలుస్తుంది.  

ఫెరఫార్మెన్స్
ఇక సుమంత్ కు వంకపెట్టేదేముంది…అతను చూపులకు బాగానే ఉంటాడు. కాస్త మంచి సీన్స్ పడితే…నటిస్తాడు. కానీ ఇందులో ఆ అవకాసం దర్శకుడు ఇవ్వలేదు. అతని చేతిలో సరైన పాత్ర పెట్టలేదు. ప్లాట్ గా ఉండే పాత్రలో సుమంత్..సాప్ట్ గా చేసుకుంటూ పోయారు. ఇక ఈషారెబ్బ  పాత్ర ..ఉందీ అంటే ఉంది లేదు అంటే లేదు అనిపించేలా డిజైన్ చేసారు. మిగతావాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.


కార్తికేయతో పోలిక ఉందా
నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాని దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేసారని మనకు స్పష్టంగా అర్దమవుతుంది. సినిమాకు అదే మిస్టరియస్ లుక్ తేవటానికి అవే స్కీమ్స్ ని అనుసరించారు అన్నిరకాలుగా.


కామెడీ ట్రాక్
ఈ సినిమాలో రిలీఫ్ కోసం ఫేక్ బాబాగా అలీ కామెడీ ట్రాక్ పెట్టారు. అదీ వర్కవుట్ కాలేదు.  టెక్నికల్ గా ..సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో టీవి సీరియల్ గా తీయాలని నిర్ణయించుకుని చేసిన సినిమాలా ఉంది. ఎపిసోడ్ ఎపిసోడ్ బ్యాంగ్ లాగ ట్విస్ట్ లు పెట్టుకున్నారే కానీ కథని పూర్తిగా కదిపే ట్విస్ట్ లులేవు. అలాగే మేకింగ్ కూడా నాశిరకంగా ఉంది. దాంతో మిగతా డిపార్టమెంట్ లు కష్టం ఏమీ ఈ సినిమాలో హైలెట్ కాలేదు.


చివరి మాట
ఇలాంటి సినిమాలు బిజినెస్ చేసుకోవచ్చేమో కానీ…జనాలను ఆకట్టుకోవటం మాత్రం కష్టమే


ఎవరెవరు
నటీనటులు : సుమంత్ , ఈషా రెబ్బా, సీనియర్ నరేష్, జోష్ రవి తదితరులు.
సంగీతం : శేఖర్ చంద్ర
నిర్మాత : సుధాకర్ రెడ్డి
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
రేటింగ్ : 1/ 5
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018