సుబ్రహ్మణ్యపురం మూవీ ఆడియో లాంచ్

Published On: December 5, 2018   |   Posted By:

సుబ్రహ్మణ్యపురం మూవీ ఆడియో లాంచ్

డైరెక్టర్ చెప్పినదానికన్నా బాగా తీశాడు-సుమంత్

‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’. ఈ సినిమా ఆడియో లాంచ్ యూనిట్ సభ్యుల మద్య సందండిగా జరిగింది. సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’ లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కు వర్క్ చేసారు. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవుతున్న సుబ్రహ్మణ్యపురం పాటల అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు శివకాంత్ రావు హాజరయ్యారు. ఇతర పాత్రలలో నటించిన హర్షిణి, జోష్ రవి, భద్రం ఈ ఆడియో లాంచ్ లో పాల్గోన్నారు.

ఈ సందర్భంగా
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ:
‘‘మధుర ఆడియో ద్వారా ఈ సినిమా పాటలను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ సినిమాలు గోదావరి, మళ్ళీరావా సినిమాలను మధురా ఆడియా ద్వారా విడుదలచేసాం, సుబ్రహ్మణ్యపురం హాట్రిక్ అవుతుందని నమ్ముతున్నాను. నాకిష్టమైన తెలుగు నటి ఈషా ఇందులో భాగం అవడం, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది 2 మిలియన్ డిజటల్ వ్యూస్ ని సాధించింది. సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నాను.

కాంగ్రెస్ నాయకుడు శివకాంత్ రావు :
‘‘నాకు ప్రతి విషయంలోనూ అండదండలుగా నిలచే వ్యక్తి బీరం సుధాకరరెడ్డి అన్న. అతను నిర్మాతగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎలెక్షన్స్ బిజీ లోనూ ఇక్కడి రావడానికి కారణం అన్నతో ఉన్న అనుబంధమే, హీరో సుమంత్ అంటే నాకు చాలాఇష్టం. సినిమా ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. నిర్మాత కు మంచి విజయం తెస్తుందనే నమ్మకం నాకు ఉంది. సినిమా మంచి విజయంసాధిస్తుందని’’ అన్నారు.

నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ:
‘‘ ఇందులో పనిచేసిన టెక్నీషన్స్ అందరకీ అందరికీ నా కృతజ్ఞతలు, దేవుడు ఉన్నాడా లేదా…? దేవుని శక్తి గొప్పదా..? మానవ మేథస్సు గొప్పదా..? అనేది ఈ నెల 7న తెలయబోతుంది. ఫైనాన్షియర్ గా కొనసాగుతున్న నేను కథ నచ్చి నిర్మాతగా మారాను.సినిమా తప్పకుండా మీకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ:
‘‘ షార్ట్ ఫిల్మ్ మేకర్ గా ఉన్న నేను సుబ్రహ్మణ్యపురం వంటి సినిమా తీసానంటే దానికి కారణం నిర్మాత సుధాకర్ రెడ్డిగారు. నేను కథ చెప్పగానే అతను నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను, ఆ సపోర్ట్ ఇప్పటివరకూ అలాగే ఉంది. నేను ఆయనకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను. సుమంత్ గారికి రెండున్నర గంటలు కథ చెప్పాను, అయిష్టంగా విన్నా వెంటనే నాకు ఓకే చెప్పారు. ఇందులో ప్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వారికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. జోష్ రవి, బద్రం, హర్షిణి గారి పాత్రలు కూడా గుర్తండిపోతాయి. ఈ సినిమా లోని సన్నివేశాలకు శేఖర్ చంద్ర ప్రాణం పోసాడు. ఈ సినిమా తర్వాత ఆయన మ్యూజిక్ ఒక మార్క్ ని సెట్ చేస్తుంది’’ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ:
‘‘ ఈ సినిమా లో చాలా పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యపురం పేరులోనే చాలా పాజిటివ్ నెస్ ఉంది. ఈ సబ్జెక్ట్ చేసిన దర్శకుడు సంతోష్ మల్లాది చంద్రశేఖర్ రావు గారి మనవడు, ఈ సినిమా తో పెద్ద హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ మంచి సపోర్ట్ గా మారబోతుంది. సుమంత్, ఈషా నాకు ఇష్టమైన నటులు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది ’’ అన్నారు.

ఈషా రెబ్బ మాట్లాడుతూ:
సుధాకర్ గారు చాలా అభిరుచి గల నిర్మాత, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో తెలిసింది. సంతో ష్ చాలా టాలెంటెడ్ దర్శకుడు. స్టోరీ చెప్పినప్పుడే అంత గ్రిప్పింగ్ గా చెప్పాడు. అతను కథ చెప్పినప్పుడు ఆరోజు అంతా కథే గుర్తు కు వచ్చింది. సుమంత్ గారితో వర్క్ చేయడం తో నేను చాలా నేర్చుకున్నాను. ఆయన మంచి నటుడే కాదు, అంతే మంచి మనిషి కూడా. ఈ టీం తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది.శేఖర్ చంద్ర గారు ఇచ్చిన మూడు పాటలు నాకు ఇష్టం. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ చాలబాగుంది. డిసెంబర్ 7న రిలీజ్ అవుతుంది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ:
‘‘ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు తెచ్చిన సుజితాకు థ్యాంక్స్. థ్రిల్లర్స్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండవు. సంతోష్ వచ్చి కథ చెప్పినప్పుడు టోటల్ ఎంగేజ్ అయ్యాను. అప్పుడు చెప్పాను చెప్పిన కథకు 70 పర్సెంట్ చేస్తే హిట్ అనుకున్నాను. కానీ సంతోష్ 90 పర్సెంట్ రీచ్ అయ్యాడు. తర్వాత నిర్మాత గురించి చెప్పాలి ఇది మాములుగా చేసే సినిమా కాదు, విఫెక్స్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. సుధాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. శేఖర్ చంద్ర తను చిన్నప్పటి నుండి తెలుసు. అతను సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఇందులో ఉన్న మూడు పాటలు నాకు నచ్చాయి. తెలుగు అమ్మాయి ఈషా తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మధుర ఆడియో లో నాకు ఈ సినిమా హాట్రిక్ అవుతుంది అని నమ్ముతున్నాను’’ అన్నారు.

సుమంత్,ఈషారెబ్బ‌,సురేష్, సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్,మిర్చి మాధ‌వి , సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు,జోష్ ర‌వి,బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్. ప్ర‌ధాన తారాగ‌ణంః

సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌. సినిమాటోగ్ర‌ఫిః:- ఆర్.కె. ప్రతాప్. ఎడిట‌ర్ః:- కార్తిక్ శ్రీనివాస్. క్యాస్టూమ్ డిజైన‌ర్ః:- సుమ త్రిపుర‌ణ‌. ఫైట్స్:- డ్రాగ‌న్ ప్ర‌కాష్‌. రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ః సంతోష్ జాగ‌ర్లపూడి. ప్రొడ్యూస‌ర్:- బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి.