సుర‌భి ఇంట‌ర్వ్యూ

Published On: March 14, 2021   |   Posted By:
సుర‌భి ఇంట‌ర్వ్యూ
 
గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడూ సిద్ద‌మే.. హీరోయిన్ సుర‌భి. 
 
ధనూష్ సరసన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌,  ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది.  ప్ర‌స్తుతం ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. మార్చి 19న ఈ మూవీ విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ సుర‌భి ఇంట‌ర్వ్యూ. 
 
* నిర్మాత‌లు నాకు ఫోన్ చేసి డైరెక్ట‌ర్‌తో మూడున్న‌ర‌ గంట‌లు క‌థ నేరేట్ చేయించారు. స్టోరీ విన‌గానే చాలా థ్రిల్ గా ఫీలై ఈ సినిమా సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఎమోష‌న్స్‌, ఇంటెన్సిటీతో కూడిన ర‌గ్‌డ్ ల‌వ్‌స్టొరీ. అందుకే ఈ సినిమాలో ఆది లుక్ అంత ర‌గ్‌డ్‌గా ఉంది. చాలా అంశాల‌తో కూడిన ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ సినిమాలో న‌ట‌న‌కు మంచి స్కోప్  ఉన్న పాత్ర నాది. ఆడియ‌న్స్‌కి తప్ప‌కుండా ఒక ఇంపాక్ట్ అయితే చూపుతుంది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల నా ఫాద‌ర్. ఒక్క కూతురునే కాబ‌ట్టి చాలా గారాబంగా పెంచుతాడు. అయితే నేను మా పేరెంట్స్‌కి ఒక్క కూతురినే అందుకే ఈ సినిమాలో నా పాత్ర‌తో వెంట‌నే క‌నెక్ట్ అయ్యాను.  
 
కాలేజ్‌లో నా బ్యాచ్‌తో క‌లిసి ర్యాగింగ్ చేసే స‌న్నివేశాలు చాలా ఫ‌న్నీగా ఉంటాయి. నాది ఒక డామినేటింగ్ ప‌ర్స‌నాలిటీ. అయితే ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్లో మ‌రో షేడ్ ఉంటుంది. అదేంట‌న్న‌ది మాత్రం సినిమాలోనే చూడాలి. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. నాతోపాటు ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మంచి ఇంపార్టెన్స్ ఉండే సినిమా ఇది.
 
ఈ సినిమాలో ఆదికి మ్యూజిక‌ల్  బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఒక మంచి వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకునే క్యారెక్ట‌ర్ నాది. ఆమె ఎందుకు అలా చేసుకోవాలి అనుకుంటుంది అనే రీజ‌న్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  
 
ఆదితో ఫ‌స్ట్‌టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను.  చాలా హంబుల్ ప‌ర్స‌న్‌. వెరీ వెరీ డౌన్ టు ఎర్త్‌. మంచి న‌టుల ఫ్యామిలీ నుండి వ‌చ్చినా అస‌లు ఆ ఫీలింగ్ ఉండ‌దు. చాలా మంచి డ్యాన్స‌ర్ కూడా. కొన్ని స‌న్నివేశాల్లో నాకు చాలా స‌పోర్ట్ చేశారు. అలాగే నిర్మాత వ‌ర్మ‌గారు మోస్ట్ నైస్ ప‌ర్స‌న్‌. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఫుల్ స‌పోర్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌తి రోజు సెట్‌కి వ‌చ్చి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చేవారు.
 
పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఒక లోకం పాట 50 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ క్రేడిట్ మా మ్యాజిక్ డైరెక్ట‌ర్ అరుణ్‌కే చెందుతుంది. మంచి ట్యూన్స్‌తో ఈ సినిమాలో ఒక మ్యాజిక్ చేశాడు. ఒకే ఒక లోకం నువ్వే త‌ర్వాత దింతాన పాట‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే మూడో పాట కూడా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష పాత్ర‌లు హిలేరియ‌స్‌గా ఉంటాయి.  ఇప్ప‌టివ‌ర‌కూ 13 సినిమాలు చేశాను. త‌మిళ్‌లో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగులో మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో డెబ్యూ మూవీ స‌క‌త్ చేస్తున్నాను. తెలుగులో రెండు స్క్రిప్ట్స్ విన్నాను త్వ‌ర‌లోనే వాటి గురించి వివ‌రిస్తాను. 
 
గ్లామ‌ర‌స్ రోల్స్ చేయ‌డానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటాను. ఇండ‌స్ట్రీలోని గ్రేట్ పీపుల్స్ అంద‌రితో వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటు న్నాను. అలాగే మైథాలాజిక‌ల్ మూవీస్ లో న‌టించ‌డం ఇష్టం. వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తాను.
 
ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ట్రైల‌ర్ చూసి చాలా బాగుంది అన్నారు. టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.