సెన్సార్ కార్యక్రమాల లో రైతన్న చిత్రం

Published On: April 7, 2021   |   Posted By:
సెన్సార్ కార్యక్రమాల లో రైతన్న చిత్రం
 
 
సెన్సార్ కార్యక్రమాల లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి రైతన్న
 
ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం రైతన్న. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తోలికాపి రెడీ అయిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: రైతన్న ఫస్ట్ కాపీ వచ్చింది.సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ చిత్రం ద్వారా చెప్పే విషయం ఏమిటంటే నేటి రైతు పరిస్థితి.ఇవాళ భారత దేశంలో రైతు కుటుంబంతో పెళ్లి సంబంధం అంటేనే ఎవరు ముందుకు రావడం లేదు. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?. రైతే దేశానికి వెన్నుముక.రైతే రాజు…ఆ నానుడి ఏమైంది.ఆ రైతు ఎక్కడున్నాడు.అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు ఈరోజు?.చాలా బాధాకరంగా వుంది రైతు పరిస్థితి.ఎందుకంటే రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక తన అప్పులు తీర్చుకో లేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లల్ని చదివించలేక వార్ధక్య లో వున్న తల్లితండ్రులకు వైద్యం చేయించలేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు.అలా రాకూడదు రైతు ఆత్మ హత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే అన్నదాత ఆ విష్ణు స్వరూపుడు బతకాలి. ఈ విశ్వాన్ని సకల జరాచర జీవరాశిని బ్రతికించాలి.అలా వుండాలి అంటే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామి నాథన్ కమిటీ సిఫార్స్ లను ఇంప్లిమెంట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు.రైతే దేశానికి వెన్నుముక.అప్పుడు రైతు వృద్ధి లోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలని అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తీసిన చిత్రమే ఈ రైతన్న అని అన్నారు