సైరా నరసింహా రెడ్డి మూవీ రివ్యూ

Published On: October 2, 2019   |   Posted By:

సైరా నరసింహా రెడ్డి మూవీ రివ్యూ

 

అయితే వీటిల్లో ఏది జనాలను థియోటర్స్ ముందు నిలబెట్టి, టిక్కెట్ కొనిపించినా..గొప్పగా ఉంటేనే గ్రేట్ అంటారు.ఈ నేపధ్యంలో వచ్చిన  ఈ సైరా ఎవరు...అంత గొప్పవాడి చరిత్ర మనం ఇన్నాళ్లూ ఎందుకు మర్చిపోయి గజినీల్లా బ్రతికాం. అసలు ఆయన జీవితంలో సినిమా తీసేటంత విషయం ఏముంది,  ఆ కథేంటి,రామ్ చరణ్ ఎందుకు ఇంత భారీగా ఖర్చు పెట్టారు. తండ్రి కోసమా..కథ కోసమా...కలెక్షన్స్ కోసమా... నిజంగా ఈ సినిమా దేశం మొత్తం రిలీజ్ అయ్యేటంత విషయం ఉన్న ప్యాన్ ఇండియా సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం

సరేరా…( ‘సైరా’రివ్యూ)
Rating:3/5

స్వాతంత్ర్య సమరయోధుడు అనగానే వెంటనే ఆయనకు పెన్షన్ వస్తుందా అని అడిగే జనరేషన్ మనది. అంతేగాని ఆయన ఎవరు..ఏ ప్రాంతం వాడు….దేశం కోసం ఏ విధంగా పోరాడాడు…ఎందుకు స్వాతంత్ర్య పోరాటంలోకు దూకాడు..ఏం సాధించాడు..ఏం పోగొట్టుకున్నాడు అని తెలుసుకోవాలనే ఆసక్తి చచ్చిపోయి చాలా కాలం అయ్యింది. అలాంటి ఈ క్రిటికల్  టైమ్ లో తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఒకాయన ఉన్నాడు…ఆయన పేరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’.ఆయన కథ ని మేము చెప్పబోతున్నాం అని చిరంజీవి ప్రకటించగానే ఖచ్చితంగా అటెన్షన్  క్రియేట్ అయ్యింది. అయితే ఆ సినిమా మీదే. స్వాతంత్ర్య సమరయోధుల కథ అంటున్నారు అంటే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది,చిరంజీవి చేస్తున్నాడు అనగానే భారీగా ఉంటుంది. తమన్నా ఉంది కాస్త గ్లామర్ ఉంటుంది అనే లెక్కలు వేసారు. అయితే వీటిన్నటికి అతీతంగా  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తెరకెక్కిందా లేక ఆ కమర్షియల్ లెక్కల పరిధిలోనే ఈ సినిమా తీసారా…ఇంతకీ  ఈ సైరా నరసింహా రెడ్డి ఎవరు వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.

దానికి తోడు బ్రిటీష్ వారు ప్రతీ నెలా ఇచ్చే భరణం కోసం తన అనుచరుడు(బ్రహ్మాజి)ని పంపితే అతన్ని అవమానించి పంపించారు. ఓ ప్రక్క కరువు, మరోప్రక్క బ్రిటీష్ వాళ్ల అకృత్యాలు, పన్ను కట్టవద్దని పిలుపు ఇచ్చాడని నరసింహారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు.  వీటిన్నటితో విసిగిన నరసింహారెడ్డి మన దేశానికి స్వాతంత్ర్యం వస్తే గానీ ఈ సమస్యల నుంచి విముక్తి ఉండదని భావించి తిరుగుబాటు ప్రారంభించాడు. అయితే నరసింహారెడ్డికు మొదట్లో తోటి పాలెగాళ్లు ఎవరూ కలిసి రాలేదు. బ్రిటీష్ వాళ్ల నుంచి వచ్చే భరణంతో ఆనందంగా ఉండక ఈ తగువులు ఎందుకు అనేది వారి వాదన. అలాంటి వాళ్లకు నాయకుడు అవుకురెడ్డి (సుదీప్).

 కథేంటి…
మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి) ఓ పాలెగాడు. రేనాడులోని ఓ సంస్దానం అయనిది. అయనతో  పాటు 61 మంది పాలెగాళ్లు ఆ ప్రాంతంలోని వేర్వేరు సంస్దానాలను ఏలుతూంటారు.  అయితే వీళ్లలో ఎవరికీ మరొకరు అంటే గిట్టదు. ఇది అవకాసం చూసుకునే బ్రిటీష్ వాళ్లు రెచ్చిపోతూంటారు. ఎవరైనా పొరపాటున కలుద్దామనుకుంటే వాళ్ల మధ్యన పుల్లలు పెట్టేస్తూంటారు. అంతేకాదు ఇక్కడ ఉండే భారతీయలను బానిసలుగా చూస్తూంటారు. పంట పండగపోయినా పన్ను కట్టమని హింసిస్తూంటారు. పన్ను కట్టకపోతే వాళ్ల అమ్మాయిలని తీసుకెళ్లి పోతామని బెదిరిస్తూంటారు. ఈ అరాచకాలను ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ నరసింహా రెడ్డికు మాత్రం ధైర్యమే ఆయుధం. జనం నరసింహావతారం చెప్పుకునే ఆయన తమ ప్రాంత ప్రజలు పన్నులు కట్టరని ఖచ్చితంగా తెగేసి బ్రిటీష్ వాళ్లకు చెప్తాడు. అంతేకాక బలవంతగా లాక్కుపోయిన పంటను పోరాడి వెనక్కి తెప్పిస్తాడు. ఇది సహజంగానే బ్రిటీష్ వాళ్లకు కాలుతుంది. అక్కడ నుంచి పోరు మొదలవుతుంది. గురువు గోసాయి ఎంక‌న్న(అమితాబ్ బ‌చ్చ‌న్‌) స్ఫూర్తితో బ్రిటీష్‌వారిపై న‌ర‌సింహారెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. ఈయన పోరాట స్పూర్తి చూసిన మిగతా పాలెగాళ్లు…  అవుకు రాజు(కిచ్చాసుదీప్‌), రాజా పాండి(విజ‌య్ సేతుప‌తి), వీరా రెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) వంటి వారు వచ్చి పోరాటానికి  అండ‌గా నిలుస్తారు. అప్పుడు నరసింహా రెడ్డి బ్రిటీష్‌వారికి ఎలా బుద్ది చెప్పాడు. చివరకు బ్రిటీష్ వాళ్లు ఏం చేసారు…  నయనతార, తమన్నా, అనుష్క పాత్రలేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

అయినా ఒంటిరిగానే పోరాటం ప్రారంభించి...బ్రిటీష్ వాళ్ల గుండెళ్ళో రైళ్లు పరుగెత్తించాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. బ్రిటీష్ వాళ్లు ఊరుకున్నారా..వాళ్లు ఏం ఎత్తులు వేసారు.. నరసింహారెడ్డి వాళ్లకు బదులు ఎలా తీర్చాడు.  సిద్దమ్మ(నయనతార)తో వివాహం ఎలా జరిగింది. లక్ష్మి (తమన్నా) పాత్ర ఏమిటి, అవుకురెడ్డి చివరకు ఏమయ్యాడు..వీరారెడ్డి(జగపతిబాబు)పాత్ర ఏమిటి,రాజ పాండి(విజయ్ సేతుపతి) సినిమాలో ఏం చేసాడు..గోసాయి వెంకన్న (అమితాబ్)పాత్ర సినిమాలో ప్రాధాన్యత ఏమిటి...మరీ ముఖ్యంగా అనుష్క ఈ సినిమాలో ఏ పాత్ర వేసింది, చివరగా నరసింహారెడ్డికు వెన్ను పోటు పొడిచింది ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ, స్క్రీన్ ప్లే

ఈ సినిమా స్టోరీ లైన్ గా పెద్ద చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నది కాదు. దాంతో కథా విస్తరణ  లో కొత్త అంశాలు ఏమీ కలవలేదు. దానికి తోడు పరుచూరి బ్రదర్స్..తమ కాలం నాటి స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు వాడి కాస్త బోర్ కొట్టిస్తారు. మారుతున్న ప్రేక్షకుల నాడిని పట్టుకుని కథనం అయితే రాయలేదు. దానికి తోడు సినిమాకు కీలకంగా నిలవాల్సిన సెకండాఫ్ పూర్తిగా ఎపిసోడిక్ గా మారిపోయింది. ఎంతసేపు బ్రిటీష్ వారికి నరసింహారెడ్డి కు మధ్య జరిగే యుద్దాన్ని చూపతాడే కానీ నరసింహారెడ్డి జర్నీని చూపరు. దాంతో చాలా ప్లాట్ గా , చూస్తున్న సీన్స్ నే మళ్లీ చూస్తున్నట్లు అనిపించింది. ఫస్టాఫ్ అయితే పూర్తిగా కథని పరిచయం చేయటానికే  సరిపెట్టేసారు. కొంచెం కూడా కథ ముందుకు జరగదు. బ్రిటీష్ వారి దుర్మార్గాలు ఓ సీన్..నరసింహారెడ్డి గొప్పతనం మరో సీన్ అన్నట్లు సాగతీసారు. ఇంటర్వెల్ ఎపిసోడ్  మాత్రం బాగుంది.

చరిత్ర కాకపోవచ్చేమో కాని చరిత్రలో నిలబడుతుంది. అయినా చిరంజీవి వయస్సు ఏమిటి...ధీరత్వంతో కూడిన ఆ  ఫెరఫార్మెన్స్ ఏమిటి అని ఆశ్చర్యపోకుండా ఉండలేం. చాలా చోట్ల నరసింహారెడ్డి పాత్రతో మెగాస్టార్ పోటీ పడతాడు. తనను తాను సవాల్ చేసుకుంటాడు. అందుకే ఈ సినిమా మెగాస్టార్ నటనా బయోపిక్ అనాలి.
 
దర్శకత్వం,నిర్మాణం
 
సురేంద్రరెడ్డి విషయం ఉన్నవాడే..గతంలో హిట్స్ ఇచ్చినవాడే…అయితే ఈ సినిమా చారిత్రకం. భారితనం, చిరంజీవి ఇమేజ్ ని డీల్ చేయటం సవాల్. ఎదురుగా బాహుబలి చిత్రం హిట్ పోటీగా కనపడుతూంటుంది. మరో ప్రక్క ఇది జరిగిన చరిత్ర మరీ ఫిక్షన్ జోడించకూడదనే విషయం అర్దమవుతూంటుంది. వీటి మధ్యన నలుగుతూ ఎవరినీ నొప్పించకుండా..తనకు నొప్పికలగకుండా సినిమా చేయాలి. ఆ విషయంలో సురేంద్ర రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే చిరంజీవిని మాస్ గా ఎలివేట్ చేయటంలో పెట్టిన శ్రద్దను స్క్రీన్ ప్లే అల్లికలో పెట్టి ఉంటే ప్రొడక్ట్ వేరే విధంగా ఉండేది. ఇక నిర్మతగా రామ్ చరణ్ ఈ సినిమాలో తన స్టామినా ఏంటో చూపించాడు. తన తండ్రి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఖర్చు పెట్టి సినిమా చేసారు. అది తెరపై అడుగడుగునా అర్దమవుతుంది. అటు డైరక్టర్ గా సురేంద్రరెడ్డి, ఇటు నిర్మాతగా రాణ్ చరణ్ పోటీ పడ్డారనిపిస్తుంది.
 
చిరు స్టామినా

మెగా స్టార్ చిరంజీవి ..అప్పట్లో ఖైదీ సినిమా సమయంలో ఏ స్దాయిలో ఎమోషన్స్ పండించారో..అదే వీరత్వం కళ్లల్లో..ఫెరఫార్మెన్స్ లో అంతకు మించి పరిపక్వత కనిపించింది. అయితే ఓ పదేళ్ల క్రితం ఈ సినిమా చేసి ఉంటే వయస్సు ఇంకా బాగా సహకరించేది. అలాగే కాస్ట్యూమ్స్ కూడా ఈ కాలానికి సంభందించినవి వేసారు. దాంతో కొన్ని చోట్ల ఆయన లుక్ తేలిపోయింది. అలుపెరగని స్వతంత్ర్య యోధుడుగా ఆ వయస్సులోనూ ఆగకుండా చేసుకుంటూ పోవటం ఆశ్చర్యమే. ఆ స్టామినాకు సెల్యూట్ కొట్టాలి.

మిగతావాళ్లు

నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్‌ పాత్ర హుందాగా అలా కూర్చునే కథ నడిపేసారు.  అవుకు రాజుగా సుదీప్‌ కు మాత్రం మంచి క్యారక్టర్.  వీరారెడ్డిగా జగపతిబాబు నప్పాడు.  బసిరెడ్డిగా రవికిషన్‌,  నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార  రొటీన్ గా చేసుకుంటూ పోయారు. ఇక ‘సైరా’లో మరో కీలకమైన పాత్ర తమన్నా, నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా ,. తన డ్యాన్స్‌, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రేకెత్తించే అమ్మాయిగా దుమ్ము రేపింది. ఇక పాండిరాజాగా విజయ్‌సేతుపతి ఆయన స్టేచర్ కు తగ్గ పాత్ర కాదు. మొదట్లో పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌, చివరిలో నాగబాబు వాయిస్  వినిపించడం మెగా ఫ్యాన్స్ కోసమే అన్నది తెలిసిందే.

టెక్నీషియన్స్…

టెక్నికల్ గా ఈ సినిమా బాగా సౌండ్ గా ఉంది. అమిత్ త్రివేది సంగీతం, జూలియ‌స్ పేకియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. ర‌త్న‌వేలుసినిమాటోగ్ర‌ఫీ గురించి  ఇవాళ కొత్తగా చెప్పుకునేదేముంది. ప్రతీ సీన్ ని ఓ మాస్టర్ పీస్ లాగ చెక్కే ప్రయత్నం చేసాడు. యాక్షన్ సీన్స్ ను  గ్రెగ్ పావెల్‌, లీ విట్టేక‌ర్‌, రామ్ ల‌క్ష్మ‌ణ్‌లు అదరకొట్టారు. ఈ టెక్నికల్ టీమే సినిమాను చాలా భాగం నిలబెట్టింది.

చరిత్ర …కల్పన

ఈ సినిమాలో చరిత్ర ఎంత ఉందో ….అంతకు మించి కల్పన కూడా ఉంది. అయితే ఇది బయోపిక్ కాదు అని మొదటే చెప్పేసారు కాబట్టి ఎవరికీ ఏ సమస్యా ఉండదు. చివరకు నరసింహారెడ్డి వచ్చి ఇదేంటి నా కథ ఇలా ఉందేంటి అని అడగడు.
 
చూడచ్చా..

చిరంజీవి అభిమానులే కాదు..దేశభక్తి, పీరియడ్ మూవీస్ చూసే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు సోసో అనిపిస్తుంది.  


తెర వెనక..ముందు

నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ

న‌టీన‌టులు: చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు

ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌
సంగీతం: అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం: జూలియ‌స్ పేకియం
ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు
కూర్పు: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి