స్కైలాబ్‌ మూవీ రివ్యూ

Published On: December 4, 2021   |   Posted By:

స్కైలాబ్‌ మూవీ రివ్యూ

సత్యదేవ్  ‘స్కైలాబ్’  సినిమా రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) 

 
👍

గత కొద్ది కాలంగా  తెలుగు సినిమా కొత్త గాలి పీలుస్తోంది. ఓటీటిల ద్వారా కొత్త తరహా కాన్సెప్టులకు అలవాటుపడిన ప్రేక్షకులకు కొత్తదనం ఇస్తేనే వర్కవుట్ అవుతుందని అర్దం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలతో లాంచ్ అయ్యే దర్శకులు ఈ కొత్తదనం వైపు ప్రయాణం పెట్టుకుంటున్నారు. పాయింట్ లోనే కొత్తదనం, ట్రైలర్ లో ఆసక్తి రేపే అంశం లేకపోతే మినిమం ఓపినింగ్స్ దక్కటం లేదని అర్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో  కేవలం హీరో నే దృష్టిలో పెట్టుకోకుండా కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రాలతో కొత్త దర్శకులు తెరంగ్రేటం చేస్తున్నారు.  తాజాగా మరో కొత్త డైరక్టర్ …డబ్బైల నాటి స్కైలాబ్ అంశాన్ని కథగా తీసుకుని సినిమా చేసారు. ఆ సినిమా ఈ రోజు రిలీజైంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది…కథలో ఏమన్నా కొత్తదనం ఆకట్టుకునే విధంగా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
 
స్టోరీ లైన్

సినిమా 1979 లో జరగుతుంది. డాక్టర్ చదువుకున్న ఆనంద్ (స‌త్య‌దేవ్‌)కు డాక్టర్ లైసెన్స్ కాన్సిల్ అయ్యిపోతుంది. అతనికో ఐదు వేలు కావాలి. అందుకోసం తన తాతగారు ఊరైన  బండ లింగంప‌ల్లికి వస్తాడు. ఆ ఊరి దొరకూతురు గౌరి(నిత్యామీనన్) ఉద్యోగం ఊడిపోతే తన ఊరు వస్తుంది. ఆమెకు పెద్ద జర్నలిస్ట్ గా తన పేరు చూసుకోవాలనే కోరిక. లేకపోతే తన తండ్రి పెళ్లి చేసేస్తాడని భయం. మరో ప్రక్క సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌)ది కూడా అదే ఊరు. ఒకప్పుడు బాగా వెలిగిన ఫ్యామిలీ. కానీ ఇప్పుడు ఆస్ది తగాదాలు,కోర్టు కేసులు మిగిలాయి. దాంతో ఊరినిండా అప్పులు చేస్తాడు. ఆ అప్పుల నుంచి బయిటపడి తన చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇలా ఎవరి గొడవలో వారు ఉండగా…ఈ లోగా అదే ఊళ్లో  స్కైలాబ్ పడబోతోందని వార్త వస్తుంది. దాంతో ఊరు నాశనం అయ్యిపోతుందని ప్రచారం జరుగుతుంది. అప్పుడు వారు ఎలా స్పందించారు. తమ లక్ష్యాలు ఎలా సాధించుకున్నారు. స్కైలాబ్ ని తమ స్వాలాభం కోసం ఎలా వాడుకుందామనుకున్నారు ..చివరకి ఏమైందనేది మిగతా కథ.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…


ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లేనే ప్రధానం. అయితే వాస్తవిక సంఘటనను సినిమా తీస్తున్నామనే ఆలోచనతో రియలిస్టిక్ గా వెళ్లాలనే ఆలోచనతో చాలా సీన్లు అటు ఫన్ కు, ఇటు రన్ సరిపడకుండా రాసుకున్నారు. దాంతో అవి అటు ఇటు కాకుండా విచిత్రంగా తయారయ్యాయి. దాంతో ఫన్ పుట్టలేదు. వాస్తవిక చిత్రం చూస్తున్నట్లు అనిపించలేదు.realism is a reflection of the world around us. ఉన్నంత కాస్తత ఫన్ కూడా క్లాస్ కామెడీ గా ఇది చాలు అని హద్దులు పెట్టుకున్నట్లు రాసుకున్నారు. అన్నిటికన్నా బ్యాడ్..సినిమా ప్రారంభంలో క్యారక్టర్స్  ఇంట్రడ్యూస్ చేసి, సెటప్ పూర్తి  అయ్యేసరికే స్క్రీన్ సమయం చాలా తీసుకున్నాడు. అక్కడే బోర్ కొట్టేయటంతో సినిమాపై ఆసక్తి పోయింది.  ఊళ్లో స్కైలాబ్  హ‌డావుడి మొద‌లు కావ‌డం నుంచే కాస్త క‌థ‌లో స్పీడు వచ్చింది. అప్పటిదాకా నత్త నడకే.

ఓ పెను విపత్తు తాకినప్పుడు మ‌నిషి తాలుకూ స్వ‌భావాన్ని, స‌మాజ‌పు కోణాన్నీ, దృక్ప‌థాన్నీ ఆవిష్క‌రిస్తూ చాలా సీన్స్ సాగాయి. అక్కడిదాకా మంచి ఆలోచన. అయితే అవి స్ట్రాంగ్ గా చెప్పలేకపోయారు. మెలో డ్రామా అవుతుందనే భయంతో అసలు డ్రామానే వదిలేసారు. స్క్రైలాబ్ చుట్టు కథ తిరగాల్సింది పోయి…క్యారక్టర్స్ చుట్టూ సినిమా తిరిగింది. స్కైలాబ్ ఓ పాత్రలా మారిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది డైరక్టర్ ఓరియెంటెడ్ కథ. అప్పుడు కథలో ఆర్క్ ని చూసుకోవాలి. అదేమీ లేకుండా కథ మొదట్లో ఎలా ఉందో ..చివరకు వచ్చేసరికి కూడా అలాగే ఉంటుంది టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఎమోషన్ పట్టించుకోలేదు.  ప్రీ క్లైమాక్స్ లో కాస్తంత హృద‌యాల్ని కాస్త కదిలిస్తుంది. కానీ అప్ప‌టికే సినిమాపై ఇంట్రస్ట్ పోతుంది. అదే ఈ సినిమాకు జరిగింది.
 
 
Technical Aspects

కొత్త దర్శకుడు మేకింగ్ పరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు. స్క్రిప్టు తప్పించి మిగతా విభాగాలపై తన పట్టుని చూపించాడు. ముఖ్యంగా 1970 ద‌శ‌కాన్ని గుర్తు చేసేలా  ఎట్మాస్మియర్ ని క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు.  పీరియడ్ లుక్ తేవటం కోసం ఆర్ట్ డిజైన్, సెట్ ప్రాపర్టీస్ ని జాగ్రత్తగా వాడుకున్నాడు. అయితే క్యారక్టరైజేషన్ కు డిటేలింగ్ ఎక్కువై విసిగించింది.

ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ వాళ్ల పనితనమే తెరంతా పరుచుకుంది.  ప్ర‌శాంత్ ఆర్‌. విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాట‌లు జస్ట్ ఓకే.  ఆదిత్య కెమెరా వర్క్ నచ్చుతుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా  ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి. చక్కటి  హాస్యం ట్రై చేసారు. ఆర్ట్ వ‌ర్క్ బాగుంది. ఎడిటింగ్ కాస్త షార్ప్ గా ఉంటే స్లో తగ్గేది.
   
 Focus on performance
 
నిత్యామీనన్ నటనలో పండిపోయింది. ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. సత్యదేవ్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ఆర్టిస్ట్.రాహుల్ రామకృష్ణ లో కేవలం కమిడియన్ మాత్రమే కాదు ఆర్టిస్ట్ ఉన్నాడని ప్రూవ్ చేసిన చిత్రం ఇది.  తనికెళ్ల భరణి, తులసి, తరుణ్ భాస్కర్ కూడా వారి పాత్రల్లో బాగా చేశారు.


బాగున్నవి

నిత్యా మీనన్
 ప్రీ క్లైమాక్స్ సీన్స్
 

బాగోలేనవి
నేరేషన్ స్లోగా ఉండటం
ఎమోషన్ లేని ఎక్సప్రెషన్స్
ఫస్టాఫ్ కామెడీ



 చూడచ్చా
కొంచెం కొత్తగా ఉంటే ఎడ్జెస్ట్ అయ్యిపోతాం అనుకునే వాళ్లు ఓ లుక్ వేయవచ్చు.
 

తెర వెనుక..ముందు

న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
సహ నిర్మాత: నిత్యామీనన్‌
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌
సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌
కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ
Run Time: 2 గంటల, 28 నిముషాలు
విడుదల తేదీ : డిసెంబర్ 4, 2021