హుషారు సినిమా రివ్యూ

Published On: December 15, 2018   |   Posted By:

హుషారు సినిమా రివ్యూ

పిచాక్!!  (‘హుషారు’ రివ్యూ)

కుర్రాళ్లు..కలలు..లక్ష్యాలు వాటి కోసం చేసే ప్రయత్నాలు ఇది పాతకాలం యూత్ ఫుల్ సినిమా కథ.  కుర్రాళ్లు..వాళ్ల  అల్లరి…కష్టాలు వస్తే కన్నీరు పెట్టకుండా కరెక్టుగా ఆలోచించి ఆలోచించించి లక్ష్యం సాధించటం ఇది నేటి యూత్ కు నచ్చే సినిమా కథ. ఇప్పటికి కొందరు పాత కథలనే ఫాలో అవుతూంటే..మరికొందరు కొత్తదారిలో ప్రయాణం పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అలాంటి కొందరు కుర్రాళ్లు కథే హుషారు. వాళ్లు తమ జీవితంలో హుషారు కోసం ఏం చేసారు. అసలు హుషారు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది…అనేది రివ్యూలో చూద్దాం.  
కుర్రాళ్లు..కాన్సర్.. కత్తిలాంటి ఐడియా
చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ..అల్లరి పిల్లలు ఆర్య (తేజ‌స్ కంచ‌ర్ల‌), చెయ్ (అభిన‌వ్), బంటి (తేజ్ కూర‌పాటి), ధ్రువ్ (దినేష్ తేజ్‌). పెద్దయ్యాక వాళ్ల అల్లరిని కంటిన్యూ చేస్తూ బ్యాడ్ బాయ్స్ గా పేరు తెచ్చుకుంటారు. అమ్మాయిలు, పబ్ లు, పార్టీలు అంటూ చెలరేగిపోతూంటారు. ఈ జీవితం నచ్చేయటంతో .. లైఫ్ లాంగ్ ఇలాగే సరదాగా గడిపేస్తూ..ఫ్రెండ్స్ గా ఉందామని ఫిక్స్ అవుతారు. అయితే వీరు ఒకటి అనుకుంటే జీవితం మరొకటి అనుకుంటుంది. వారి ఫ్రెండ్స్ లో కాస్తంత యాక్టివ్ గా ఉండే చై జీవితంలో ట్విస్ట్ ఇస్తుంది. తన గర్ల్ ప్రెండ్ తో బ్రేకప్ అయ్యిందని డిప్రెషన్ లో ఉన్న అతనికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ నుంచి కోలుకునే లోగా మరో ట్విస్ట్..కాన్సర్ బయిటపడుతుంది. 
చేసేదేముంది ..నలుగురు ప్రెండ్స్ కలిసి డబ్బులు వేసుకుందామంటే అదేమీ బీర్ బాటిల్ కాదు కదా…దాంతో ఏం చేయాలో అర్దం కాదు.రోజులు గడిస్తే ప్రాణాలకే ప్రమాందం. ముప్పై లక్షలు ఖర్చు అని డాక్టర్  చెప్పాడు. అప్పుడు ఆ కుర్రాళ్లలో ఒకరకి ఒక ఆలోచన వస్తుంది. దాంతో డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఆ ఆలోచన సక్సెస్ అవ్వాలి..టైమ్ పడుతుంది. ఈలోగా ప్రాణం ఉంటుందా…తమ స్నేహితుడుని రక్షించుకోగలమా…ఇలాంటి చిత్రమైన సమస్యను ఆ కుర్రాళ్లు ఎలా ఎదుర్కొన్నారనేది మిగతా కథ. ఇంతకీ వాళ్లకు వచ్చిన ఐడియా ఏమిటి, ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ పాత్ర ఏమిటి..హీరోయిన్స్ క్యారక్టర్స్ ఏమిటనేది  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎలా ఉందంటే..
ఈ సినిమా కుర్రాళ్లు ఆలోచనలు, కలలకు దగ్గరగా ఉందని చెప్పలేం కానీ కొంతవరకూ ఈ జనరేషన్ ని ప్రతిబింబింది అని చెప్పచ్చు. దర్శకుడు సినిమాని బాగానే డీల్ చేసాడు కానీ …డబుల్ మీనింగ్ ల సాయిం తీసుకోవటం డైజస్ట్ కాదు. అలాగే కథలో కాంప్లిక్ట్ ఎలిమెంట్ చాలా సేపటి వరకూ రాదు. ఆ మధ్యన వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా గుర్తుకు వస్తుంది. కథ విషయంలో పోలిక కాదు కానీ కథనం విషయంలో ఈ రెండూ ఒకే స్కీమ్ ని ఫాల్ అయ్యాయి. కాకపోతే ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం…కామెడీతో సీన్స్ ని డీల్ చెయ్యటం. అది కనుక లేకపోతే సినిమాని చూడటం చాలా కష్టమయ్యేది. 
కొత్త డైరక్టర్ ఎలా చేసాడు
ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అయిన శ్రీహర్ష..ఆలోచనలు కొత్తగా ఉన్నా వాటిని సరైన పద్దతిలో పెట్టలేకపోయారనిపిస్తుంది. సినిమా అంటే కేవలం కొన్ని కామెడీ సీన్స్ అనుకుని, చివర్లో ఓ సమస్యపెట్టుకుని ముగించటం కాదు కదా. రెండున్నర గంటలు సేపు తమ టైమ్, డబ్బు ఇచ్చే వారికి విలువ ఇవ్వాలి కదా. ఆ విషయం గుర్తు పెట్టుకుంటే ఈ దర్శకుడు తెలుగులో సక్సెస్ అవుతాడు. 
హైలెట్స్
ఇక ఈ సినిమాలో గొప్పగా చెప్పుకునే అంశం…రాధన్ మ్యూజిక్. ‘ఉండిపోరాదే’ సాంగ్  పట్టేసింది ఇప్పటికే..అదే ఓపినింగ్స్ రప్పించింది.  పిచాక్ సాంగ్ సైతం కుర్రాళ్లలోకి వెళ్లింది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓకే. కొత్త కుర్రాళ్లు అయినా తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్‌లు అలా అనిపించరు. రాహుల్ రామకృష్ణ ప్రస్టేటెడ్ సాప్ట్ వేర్ ఇంజినీర్ లా దుమ్ము దులిపాడు. అతనకెంత క్రేజ్ ఉందో …రెస్పాన్స్ ని బట్టి చెప్పచ్చు.
ఆఖరి మాట
కుర్రాళ్లను టార్గెట్ చేసిన ఈ సినిమా వాళ్లను రీచ్ అవ్వాలంటే ఆ విషయం వాళ్లకు తెలిసేలా పబ్లిసిటీ చేయాలి.  
ఎవరెవరు
న‌టీన‌టులు: రాహుల్ రామకృష్ణ, తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్‌

కూర్పు: విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి 

ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్‌తోట‌ 

సంగీతం: ర‌థ‌న్ 

క‌ళ‌: మ‌రేష్ శివ‌న్ 

నిర్మాత‌లు: బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌

రచన, ద‌ర్శ‌క‌త్వం: శ్రీహ‌ర్ష కొనుగంటి 

సంస్థ‌: ల‌క్కీ మీడియా 

విడుద‌ల‌: 14-12-2018

Rating: 2.5