101 జిల్లాల‌ అంద‌గాడు చిత్రం ఫస్ట్ లుక్ విడుద‌ల

Published On: March 26, 2021   |   Posted By:

101 జిల్లాల‌ అంద‌గాడు చిత్రం ఫస్ట్ లుక్ విడుద‌ల

`101 జిల్లాల‌ అంద‌గాడు` ఫస్ట్ లుక్… గొత్తి సత్యనారాయణగా డిఫరెంట్ గెట‌ప్‌లో అవ‌స‌రాల శ్రీనివాస్
 
డిఫ‌రెంట్ సినిమాలకు ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో కొత్త త‌రం ద‌ర్శ‌కులు వైవిధ్య‌మైన చిత్రాలు, పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ జాగ‌ర్ల‌మూడి క‌లిసి డిఫ‌రెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల  శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఎంట‌ర్‌టైన‌ర్  ‘101 జిల్లాల అంద‌గాడు’ . రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి  నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఫ‌స్ట్‌లుక్ చూస్తే అవ‌స‌రాల శ్రీనివాస్ బ‌ట్ట‌త‌ల‌తో క‌నిపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోకు బ‌ట్ట‌త‌ల ఉండ‌ట‌మనేది ఇప్ప‌టి వ‌ర‌కు రాన‌టువంటి క‌థాంశం. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న `101 జిల్లాల‌ అంద‌గాడు` చిత్రంలో అవ‌స‌రాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయ‌ణ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. రుహ‌నీ శ‌ర్మ హీరోయిన్‌. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా,సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్  `101 జిల్లాల‌ అంద‌గాడు`  చిత్రంలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు  ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోఉంది. మే 7న సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 
 
 
న‌టీన‌టులు:  
అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు 
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
ర‌చ‌యిత‌:  అవ‌స‌రాల శ్రీనివాస్‌
సినిమాటోగ్ర‌ఫీ:  రామ్‌
ఎడిట‌ర్‌:  కిర‌ణ్ గంటి
సంగీతం:  శ‌క్తికాంత్ కార్తీక్‌
ఆర్ట్‌: ఎ.రామాంజ‌నేయులు