101 జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

Published On: September 3, 2021   |   Posted By:

 

101 జిల్లాల అందగాడు మూవీ రివ్యూ

అవసరాల ‘101 జిల్లాల అందగాడు’ రివ్యూ
Rating:  2/5


బట్టతల చుట్టూ తిరిగే కథలతో తీసే సినిమాలు ఈ మధ్యకాలంలో కన్నడంలో ఒకటి, హిందీలో రెండు సినిమాలు వచ్చాయి..విజయవంతమయ్యాయి. తెలుగులోనూ ఎవరైనా ఆ రీమేక్ రైట్స్ తీసుకుని చేస్తారేమో అని సినీ లవర్స్ ఎదురుచూసారు. కానీ రీమేక్ కాకుండా ఫ్రీ మేక్ లా ఈ కాన్సెప్టుని మరింత లోకలైజ్ చేసి,నేటివిటి అద్ది థియేటర్ లో దింపారు. అవసరాల శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫన్ ఎప్పుడూ బాగుంటుంది. ఈ సినిమాలోనూ దాన్ని కొనసాగించారా…‘101 జిల్లాల అందగాడు’  అలరించాడా…కామెడీ కోసం ఈ సినిమా చూడచ్చా, కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
  స్టోరీ లైన్

రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసే గొత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్)కి బట్టతల. దాంతో తనకు పెళ్లి కాదేమో..అమ్మాయిలు ఎవరూ తనను ఇష్టపడరేమో అని బాధపడుతూంటాడు. బట్టతలను కవర్ చేసేందుకు టోపీ, విగ్ లు పెడుతూంటాడు. ఈ క్రమంలో అదే ఆఫీస్ లో పనిచేసే అంజలి(రుహానీ శర్మ) పరిచయం అవుతుంది. యాజటీజ్ గా ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. వాళ్ల పేరెంట్స్ ని కలుస్తాడు. వాళ్లు ఈ జంట పెళ్లికి ఒప్పుకుంటాడు. అంతా హ్యాపీ అనుకున్న టైమ్ లో సూర్యనారాయణకు బట్టతల అనే విషయం అంజలికు తెలిసిపోతుంది. దాంతో ఎప్పుడూ నిజాలు చెప్పాలని, అబద్దాలు చెప్తే తట్టుకోలేని ఆమె హర్ట్ అవుతుంది. అక్కడ నుంచి సూర్యనారాయణ ఏం చేసాడు..వీరి ప్రేమ కథ ఏ తీరానికి చేరింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

 స్క్రీన్ ప్లే ఎనాలసిస్
జనం మంచి కామెడీ సినిమా వస్తే చూద్దామనే మూడ్ లో ఉన్నారు. దాన్ని అనుసరిస్తూ అవసరాల ఈ బట్టతల కామెడీతోని తీసుకొచ్చాడు. అంతవరకూ బాగుంది. అయితే ఈ తరహా కథలు ఎలా ఉండబోతాయో ప్రేక్షకుడుకు పూర్తి అవగాహన ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే మూడు నిముషాల్లో కళ్లు మూసుకుని సగటు ప్రేక్షకుడు చెప్పేయగలడు. అక్కడే సమస్య మొదలవుతుంది. ప్రెడిక్టబులిటీ గా కథ జరగకుండా జాగ్రత్తల తీసుకోవాలి. అందుకు ఊహకు అందని విధంగా టెర్రిఫిక్ ట్రీట్మెంట్ కావాలి. అదే ఈ సినిమాలో మిస్సైంది. సినిమా ప్రారంభం కథలోకి వెళ్లటమే చాలా టైమ్ పట్టింది. ఫస్ట్ యాక్ట్ బోర్ కొట్టేసేటంత లెంగ్తీగా ఉంది. దాంతో డల్ గా బోర్ గా తయారైంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయినా గొప్పగా ఉంటుందేమో అనుకుంటే అదీ ఊహించగలిగేదే. అయితే ఫెరఫెక్ట్ ప్లేస్ లోనే ఇంట్రవెల్ పడింది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ నత్త నడక మొదలైంది. విగ్ కామెడీ సినిమాకు బలం,బలహీనత కూడా. ఫస్టాఫ్ కామెడీ చేసాం కదా సెకండాఫ్ ఎమోషన్ తో ముంచేద్దామనుకున్నారు. కానీ ఆ సీన్స్ ఏమీ వర్కవుట్ కాలేదు. తల్లి,కొడుకు సెంటిమెంట్ ఉన్నంతలో బాగుంది. హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు.  చాలా సీన్లు ఫన్ పేలలేదు. ముఖ్యంగా ఎక్కడా డెప్త్ లోకి వెల్లలేదు. కేవలం ఓ కామెడీ గా సబ్జెక్టుని డీల్ చేసారు. క్లైమాక్స్ తేలినట్లు అనిపించినా సినిమాకు ఫెరఫెక్ట్ యాప్ట్.

  టెక్నికల్ గా..
స్క్రిప్టు పరంగా సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. డైలాగులు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్సైంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. డైరక్టర్ గా ఈ సినిమాతో పరిచయం అయిన విద్యాసాగర్..నటీనటుల నుంచి మంచి అవుట్ ఫుట్ తీసుకున్నారు కానీ తన ముద్ర అయితే వేయలేకపోయారు.

  ఆర్టిస్ట్ ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే..
అవసరాల తన  టైపు క్లాసిక్ కామెడీ సీన్స్ రాసుకుని, అందులో లీనమైపోయాడు. అవసరాల కాకపోతే ఈ మాత్రం కూడా చూడలేకపోదుము. హీరోయిన్ రుహాని శర్మ అర్బన్ అమ్మాయి పాత్రకు జీవం పోసింది.  రోహిణి క్యారక్టర్ లెంగ్త్ త‌క్కువే అయినా ఆమె పాత్రతో కొన్ని ఎమోషన్స్ పండాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా
ఓటీటి లో వచ్చేవరకూ వెయిట్ చేయచ్చు
 
తెర వెనుక..ముందు
బ్యానర్‌: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,
నటీనటులు: అవసరాల శ్రీనివాస్‌, రుహాని శర్మ, రోహిణి, శివన్నారాయణ, తదితరులు;
కథ : అవసరాల శ్రీనివాస్‌;
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
 సినిమాటోగ్రఫి: రామ (రాంరెడ్డి)
సమర్పణ: దిల్‌రాజు, క్రిష్‌;
నిర్మాత: శిరీష్‌ రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు;
దర్శకుడు: రాచకొండ విద్యాసాగర్‌;
రన్ టైమ్: 2 గంటల 5 నిముషాలు
విడుదల తేదీ: 03-09-2021