15 ఏళ్ల మ‌న్మ‌థుడు

Published On: December 20, 2017   |   Posted By:

15 ఏళ్ల మ‌న్మ‌థుడు

అక్కినేని నాగార్జున‌కు స‌క్సెస్‌లు బ్రేక్ వ‌చ్చి, మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌లో ప‌డ‌టానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. సంతోషం సినిమాతో స‌క్సెస్ అందుకున్నారు నాగార్జున‌. వెంట‌నే నాగ్ త‌న స్వీయ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో చేసిన చిత్ర‌మే `మ‌న్మ‌థుడు`. 2002 డిసెంబ‌ర్ 20న సినిమా రిలీజ్ అయ్యింది. స్వ‌యం వ‌రం, నువ్వే కావాలి, నువ్వు నాకు న‌చ్చావ్ చిత్రాల ద‌ర్శ‌కుడు కె.విజ‌య్ భాస్క‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమాకు త్రివిక్ర‌మ్ మాటలు పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. స్త్రీల‌ను ద్వేషించే ఓ యువ‌కుడు ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడ‌నేదే క‌థ‌. ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్స్‌గా న‌టించారు.