150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన జై లవకుశ

Published On: October 12, 2017   |   Posted By:

150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన జై లవకుశ

ఎన్టీఆర్ కూడా 150 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. 3 డిఫరెండ్ గెటప్స్ లో యంగ్ టైగర్ నటించిన జై లవకుశ సినిమా

గ్రాండ్ గా 4వ వారంలోకి ప్రవేశించడంతో పాటు ప్రపంచవ్యాప్త వసూళ్లలో 150 కోట్ల రూపాయల మార్క్ కూడా అందుకొని ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. దసరా బరిలో నిలిచిన స్పైడర్ సినిమా ఇప్పటికే 150 కోట్ల రూపాయల గ్రాస్ అందుకోగా.. 3 రోజుల ఆలస్యంగా జై లవకుశ ఈ ఘనత సాధించింది.

విడుదలైన 2 వారాల్లోనే 129 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది జై లవకుశ సినిమా. ఆ తర్వాత దసరా సీజన్ ముగియడం, సెలవులు పూర్తవ్వడంలో వసూళ్లలో జోరు తగ్గింది. కానీ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్, సినిమాకు వచ్చిన పాజిటివ్ రివ్యూస్ కారణంగా తక్కువ రోజుల్లోనే 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించగలిగింది జై లవకుశ.

ఇక తెలుగు రాష్ట్రాల వసూళ్ల విషయానికొస్తే.. విడుదలైన 19 రోజుల్లో 79 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది జై లవకుశ సినిమా. నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా 80కోట్ల రూపాయల షేర్ దాటేసినట్టే. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుంది జై లవకుశ.