17 నుంచి పైసా వసూల్ ఆడియో

Published On: August 12, 2017   |   Posted By:
17 నుంచి పైసా వసూల్ ఆడియో
బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ సినిమా పాటల ప్రక్రియను ఈనెల 17 నుంచి ప్రారంభించబోతున్నారు. అంటే 17వ తేదీ నుంచి దశలవారీగా సాంగ్స్ ను ఆన్ లైన్ లో విడుదల చేస్తారన్నమాట. ఇందులో భాగంగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాటల్లో మొదటి పాట 17వ తేదీన యూట్యూబ్ లో ప్రత్యక్షంకానుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మొన్ననే గుమ్మడికాయ ఫంక్షన్ కూడా చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. బాలయ్య డబ్బింగ్ కూడా పూర్తయింది. సెప్టెంబర్ 1న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా దశలవారీగా పాటలు విడుదల చేసి, పెద్ద ఎత్తున ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారు. అన్నట్టు పైసా వసూల్ ఫంక్షన్ కు సంబంధించి ఇప్పటికే ఖమ్మంను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.