2.0 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Published On: September 9, 2017   |   Posted By:
2.0 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్
రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమా ఆడియో ఫంక్షన్ ను వచ్చేనెలలో సెలబ్రేట్ చేయబోతున్నామంటూ శంకర్ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ ఆడియో రిలీజ్ డేట్ కూడా బయటపెట్టాడు. వచ్చేనెల 27న 2.0 పాటల వేడుక ఉంటుంది. దుబాయ్ లోని ప్రసిద్ధ బుర్జ్ ఖలీఫా టవర్ కింద ఉన్న బుర్జ్ పార్క్ లో ఈ ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.
ఈ ఆడియో ఫంక్షన్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహ్మాన్ తో ఏకంగా లైవ్ షో కూడా ఇప్పించబోతున్నారు. అలా భారీ ఎత్తున ఓ కార్యక్రమాన్ని నిర్వహించి పాటల్ని గ్రాండ్ గా మార్కెట్లోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఎమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ లో దుబాయ్ లో ఆడియో రిలీజ్ చేసి, నవంబర్ లో హైదరాబాద్ లో టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఇక డిసెంబర్ లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్రయిలర్ ను చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.