2.0  టీజ‌ర్‌పై క్లారిటీ ఇచ్చిన శంక‌ర్‌

Published On: January 27, 2018   |   Posted By:

2.0  టీజ‌ర్‌పై క్లారిటీ ఇచ్చిన శంక‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రోబో సీక్వెల్ `2.0` రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇందులో నెగ‌టివ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను  ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారని స‌మాచారం. ఈ సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చినా టీజ‌ర్ మాత్రం విడుద‌ల కాలేదు. అందుకు కార‌ణ‌ముంద‌ట‌. సీజీ వ‌ర్క్ పూర్తి కానీ కార‌ణంతో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేద‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెలిపారు. వ‌ర్క్ అంతా పూర్తి కాగానే టీజ‌ర్ విడుద‌ల‌వుతుంద‌ట‌. సినిమా సీజీ వ‌ర్క్ అంతా లాస్ ఏంజిల్స్‌లో జ‌రుగుతుంది.