2.0 టీజ‌ర్ జ‌న‌వ‌రి 26న విడుద‌ల

Published On: December 6, 2017   |   Posted By:

2.0 టీజ‌ర్ జ‌న‌వ‌రి 26న విడుద‌ల

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రోబో సీక్వెల్ `2.0` రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రోబో చిట్టిగా ర‌జ‌నీకాంత్ క‌న‌ప‌డుతుంటే..అత‌న్ని ఎదుర్కొనే విల‌న్ పాత్ర‌లో అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నారు.  ఈ సినిమా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌వుతుంద‌ని యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే రీసెంట్‌గా సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటునట్లు తెలిపింది. ఈ గ్యాప్ చాలా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఫ్యాన్స్ కోస‌మ‌ని టీజ‌ర్‌ని జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసింద‌ట‌. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మార్చిలో విడుద‌ల చేస్తారట‌, ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.