2.0 సినిమా ఒక్క తెలుగులోనే 100 కోట్లు రావాలి

Published On: August 12, 2017   |   Posted By:
2.0 సినిమా ఒక్క తెలుగులోనే 100 కోట్లు రావాలి
నిజానికి 2.0 సినిమా తెలుగు రైట్స్ ను వంద కోట్ల రూపాయలకు పైగా అమ్మాలనుకున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కనీసం వంద కోట్లకు అమ్మకపోతే నిర్మాతలకు గిట్టుబాటు కాదు. కానీ ఈ సినిమా తెలుగు రైట్స్ 81 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అయితే ఈ మొత్తం కూడా తక్కువేం కాదు. ఓ డబ్బంగ్ సినిమాకు తెలుగులో ఇంత ధర పలకడం ఇదే ఫస్ట్ టైం. ఇదో రికార్డు కూడా.
81 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన 2.0 సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఒక్క టాలీవుడ్ లోనే వంద కోట్ల రూపాయలు రావాలి. అప్పటికి ఆ సినిమా లాభాల్లోకి వచ్చినట్టు కాదు. ఖర్చులు పోను బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అవుతుంది. ఇక అందరూ లాభాలు అందుకోవాలంటే వంద కోట్ల రూపాయల పై నుంచి ఎంతొస్తే అది ప్రాఫిట్ కింద లెక్క.
మరి 2.0 సినిమాకు టాలీవుడ్ లో వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వస్తాయా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే జనీకాంత్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఉన్న మాట వాస్తవమే. కాకపోతే తమిళ ఆడియన్స్ లా ఇక్కడి ప్రేక్షకులు వేలం వెర్రిగా సూపర్ స్టార్ సినిమాలు చూడరు. మూవీ బాగుంటే చూస్తారు లేదంటే ఫ్లాప్. గతంలో వచ్చిన విక్రమసింహ, లింగ, కబాలి సినిమాలు టాలీవుడ్ లో ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అలా వరుసగా రజనీకి 3 ఫ్లాపులు ఉన్నప్పటికీ.. 2.0 సినిమాకు 81 కోట్ల రూపాయల ధర పలకడం విశేషం.
తెలంగాణలో ఈ సినిమా హక్కుల్ని గ్లోబల్ సినిమాస్ సంస్థ దక్కించుకుంది. హీరో నితిన్, అతడి తండ్రి సుధాకర్ రెడ్డికి చెందిన కంపెనీ ఇది.