25 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని  మూవీ నిన్ను కోరి

Published On: July 19, 2017   |   Posted By:
25 కోట్ల క్లబ్ లోకి చేరిన నాని  మూవీ నిన్ను కోరి
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి. నివేత థామస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరో ఫీట్ దక్కించుకుంది. వరల్డ్ వైడ్ 25 కోట్ల రూపాయల షేర్ సాధించి నాని మార్కెట్ స్టామినాను నిరూపించింది. ఈ వసూళ్లతో ఏ కొందరిలో అనుమానాలున్నా అవి తీరిపోతాయి. నిన్ను కోరి సినిమా హిట్ అనే విషయాన్ని అంతా ఒప్పుకొని తీరాల్సిందే.
శివ నిర్వాణ డైరక్ట్ చేసిన నిన్నుకోరి సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ  దానయ్య నిర్మించారు. కథ ప్రకారం ఎక్కువ భాగం చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించారు. ఈ ఎలిమెంట్ ఓవర్సీస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో.. విడుదలైన వారం రోజులకే మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టింది నిన్నుకోరి సినిమా.
నిన్నుకోరి సినిమా హిట్ అవ్వడంతో కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ మరో విజయాన్నందుకున్నాడు నాని. ఇదే ఊపులో ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో నటిస్తున్న ఎంసీఏ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు.