3 రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన వివేగమ్ సినిమా

Published On: August 29, 2017   |   Posted By:

3 రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన వివేగమ్ సినిమా

అజిత్ పవరేంటో మరోసారి రుచిచూపించింది వివేగమ్ సినిమా. తెలుగులో ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. తమిళనాట మాత్రం సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మొదటి 3 రోజులు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. శివ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా స్టయిలిష్ యాక్షన్ ఎడ్వంచరస్ మూవీగా తెరకెక్కిన వివేగమ్ సినిమా విడుదలైన మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ లో రజనీకాంత్ నటించిన కబాలి తర్వాత అతి తక్కువ టైమ్ లో వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది కబాలి.

ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్

తమిళనాడు – రూ. 55 కోట్లు

కర్ణాటక – రూ. 8.65 కోట్లు

కేరళ – రూ. 3.60 కోట్లు

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ – రూ. 5.30 కోట్లు

యూఎస్ఏ – రూ. 3.05 కోట్లు

కెనడా – రూ. 0.55 కోట్లు

సింగపూర్ – రూ. 2.75 కోట్లు

మలేషియా – రూ. 6.75 కోట్లు

యూకే (బ్రిటన్) – రూ. 1.22 కోట్లు

యూఏఈ (అరబ్ ఎమిరేట్స్) – రూ. 5.60 కోట్లు

జీసీసీ (6 గల్ఫ్ దేశాల కూటమి) – రూ. 0.95 కోట్లు

ఆస్ట్రేలియా – రూ. 1.22 కోట్లు

న్యూజిలాండ్ – రూ. 0.17 కోట్లు

శ్రీలంక – రూ. 3.20 కోట్లు

ఫ్రాన్స్ – రూ. 0.30 కోట్లు

ROW (రెస్ట్ ఆఫ్ వరల్డ్) – రూ. 5.50 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ – 104.60 కోట్లు