30 కోట్ల క్లబ్ పై కన్నేసిన ఫిదా

Published On: July 25, 2017   |   Posted By:

30 కోట్ల క్లబ్ పై కన్నేసిన ఫిద

ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన ఫిదా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ బడా రికార్డుపై కన్నేసింది. అదే 30 కోట్ల రూపాయల క్లబ్. ఇప్పటికే 13 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా.. ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో 30 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించే అవకాశాలున్నట్టు ట్రేడ్ పండింట్స్ ఎనలైజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్, థియేటర్లలో ఆక్యుపెన్సీ రేషియో చూస్తుంటే… లాంగ్ రన్ లో 30 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద సమస్య కాదంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. వర్కింగ్ డే రోజు అయిన సోమవారం కూడా ఫిదా సినిమాకు నైజాం థియేటర్లలో 80శాతం ఆక్యుపెన్సీ వచ్చిందంటే.. సినిమా బాగా ఆడియన్స్ కు కనెక్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు.

అటు బి, సి సెంటర్లలో కూడా ఫిదా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండడం విశేషం. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా బి, సి సెంటర్లలో ఆడుతుందా, ఆడదా అనే అనుమానం వ్యక్తంచేశారు. కానీ ఆ డౌట్స్ ను పటాపంచలు చేసి, దిల్ రాజుకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఫిదా.