30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా చిత్రo మార్చి విడుద‌ల‌

Published On: March 7, 2020   |   Posted By:
30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా చిత్రo మార్చి విడుద‌ల‌
 
జీఏ2-యువి ద్వారా ప్ర‌దీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ మార్చి 25 విడుద‌ల‌

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తెలుగు నూత‌న సంవ‌త్స‌రాది – ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 25న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. సినిమా ఔట్‌పుట్ చూసి న‌చ్చ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లతో జీఏ2, యువి క్రియేష‌న్స్ సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకోవ‌డం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌ల స‌పోర్ట్ ల‌భించ‌డం సినిమాకి ప్ల‌స్ అవుతోంది.

క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రాల నిర్మాత‌గా పేరుపొందిన ఎస్వీ బాబు ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ చిత్రాన్ని ఎస్వీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పేరుపొందిన తార‌లు ప‌లువురు న‌టించ‌గా, టాప్ టెక్నీషియ‌న్లు ప‌నిచేశారు.

అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, చంద్ర‌బోస్ అన్ని పాట‌లూ రాశారు. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు.

ఇదివ‌ర‌కు చిత్ర బృందం విడుద‌ల చేసిన రెండు పాట‌లు – ‘నీలి నీలి ఆకాశం’, ‘ఇదేరా స్నేహం’.. సంగీత ప్రియుల ఆద‌ర‌ణ‌ను అమితంగా పొందాయి. మొద‌టగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ రిలీజ్ చేసిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సెన్సేష‌న‌ల్ హిట్ట‌యి, ఇప్ప‌టికే 60 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం పెద్ద విశేషంగా చెప్పాలి. సిద్ శ్రీ‌రామ్‌, సునీత ఆల‌పించిన ఆ పాట‌ ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా వినిపిస్తోంది. ఇక ధ‌నుంజ‌య్‌, మోహ‌న భోగ‌రాజు పాట‌గా లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘మీకో దండం’ పాట కేవ‌లం 24 గంట‌ల్లో 3 మిలియ‌న్ వ్యూస్ పైగా సాధించ‌డం గ‌మ‌నార్హం.

తారాగ‌ణం:
ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌, శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్ర‌సాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌.

సాంకేతిక బృందం:
పాటలు: చంద్రబోస్
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్: నరేష్ తిమ్మిరి
పీఆర్వో: వంశీ-శేఖర్
నిర్మాత: ఎస్వీ బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మున్నా.