400కి పైగా థియేట‌ర్స్‌లో మ‌హానుభావుడు

Published On: September 20, 2017   |   Posted By:
400కి పైగా థియేట‌ర్స్‌లో మ‌హానుభావుడు
యూత్‌ఫుల్ చిత్రాల స్పెష‌లిస్ట్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మ‌హానుభావుడు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న శ‌ర్వానంద్ ఇందులో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. అతి శుభ్ర‌త ఉన్న యువ‌కుడి పాత్ర‌తో వినోదాత్మ‌కంగా ఈ సినిమా తెర‌కెక్కింది. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత‌మందించారు.
ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. అలాగే నిన్న విడుద‌ల చేసిన ట్రైల‌ర్ హిలేరియ‌స్‌గా ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇదిలా ఉంటే.. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 29న ఈ సినిమా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.
జైల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ వంటి పెద్ద సినిమాల‌తో విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ మ‌హానుభావుడు 400కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంద‌ని స‌మాచారం. గ‌త చిత్రం బాబు బంగారం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు మారుతి.