50 రోజులు పూర్తిచేసుకున్న రంగస్థలం

Published On: May 18, 2018   |   Posted By:

50 రోజులు పూర్తిచేసుకున్న రంగస్థలం
 

రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అవతరించిన రంగస్థలం సినిమా ఇవాళ్టి తో 50 రోజులు పూర్తిచేసుకుంది. చరణ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది రంగస్థలం. అటు ఓవర్సీస్ లో కూడా 4 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరేందుకు దూసుకుపోతోంది.

ఓ సినిమా ఈ రోజుల్లో 50 రోజులు ఆడడం చాలా పెద్ద విషయం. అలాంటిది రంగస్థలం సినిమా ఏకంగా 81 సెంటర్లలో 50 రోజులు ఆడింది. ఇంకా కొనసాగుతోంది. వీటిలో ఓ కర్ణాటక సెంటర్ కూడా ఉంది. ఏపీ, నైజాంలో రంగస్థలం 50 రోజులు పూర్తిచేసుకున్న థియేటర్ల సంఖ్య ఇలా ఉంది

నైజాం – 13 (హైదరాబాద్ – 4, మిగతా జిల్లాలు – 9)
సీడెడ్ – 23 (చిత్తూరు-4, అనంతపురం-2, కడప-8, కర్నూలు-9)
నెల్లూరు – 4
గుంటూరు – 7
కృష్ణా – 2
వెస్ట్ – 6
ఈస్ట్ – 4
ఉత్తరాంధ్ర – 21
కర్ణాటక – 1

మొత్తం 50 రోజుల కేంద్రాలు – 81