A1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

Published On: March 6, 2021   |   Posted By:
A1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ
 
 
 
 
పట్టాలు తప్పలేదు కానీ…: ‘A1 ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ

Rating:2.5/5

 సందీప్ కిషన్ కు హిట్,ప్లాఫ్ లు …వెలుగు నీడల్లా ఒకదాని వెనక మరొకటి వస్తున్నాయి. వరస ఫ్లాఫ్ ల తర్వాత నిను వీడని నీడను నేనే’ తో రిలీఫ్ అయ్యాడు.  ఆతర్వాత వెంటనే తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. దాంతో ఈ సారి కెరీర్ ని దార్లో పెట్టేందుకు..రూట్ మార్చి స్పోర్ట్స్ బాట పట్టాడు. హాకీ స్టిక్ పట్టుకుని, తన సెంటిమెంట్ టైటిల్ ని తోడు తీసుకుని, ఎందుకైనా మంచిదని ఓ తమిళ రీమేక్ అండతో థియోటర్ లోకి దూకాడు. మరి ఈ సారి మళ్లీ హిట్ కొట్టాడా…వెంకటాద్రి ఎక్సప్రెస్ టైటిల్ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అయ్యిందా..ఈ సినిమా లో విషయం ఏమిటి..చూద్దాం.

స్టోరీ లైన్

యానాంలోని చిట్టిబాబు హాకీ స్టేడియం అంటే పెద్ద పేరు.  ఆ స్టేడియాన్ని క్రీడాశాఖా మంత్రి (రావు ర‌మేష్) స్వాధీనం చేసుకొని ఓ కార్పోరేట్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. అందుకోసం అక్కడ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న యానాం హాకీ క్ల‌బ్‌ టీమ్ ని  అండ‌ర్‌ప‌ర్‌ఫార్మ‌ర్  ప్ర‌క‌టింప‌జేస్తాడు. ఈ స్కెచ్ తో స్టేడియం నొక్కేద్దామనుకుంటాడు.  అయితే ఆ  స్టేడియాన్ని రక్షించాలని అనుకుంటాడు కోచ్ మురళీశ‌ర్మ‌. అందుకోసం వైజాగ్ క్ల‌బ్ టీమ్‌తో జ‌రిగే క్వాలిఫ‌యింగ్  మ్యాచ్‌లో యానాం క్ల‌బ్ గెలిస్తే జాతీయ టోర్నీకి అర్హ‌త సాధించాలని అనుకుంటాడు. కానీ తమ టీమ్ లో వైజాగ్ టీమ్ తో ఆడే గొప్ప ప్లేయర్ ఏడీ అని మధన పడుతూంటాడు.

అప్పుడే యానాంలోని మావ‌య్య ఇంటికి వ‌స్తాడు సందీప్ నాయుడు (సందీప్‌కిష‌న్‌). అక్క‌డ అతనికి హాకీ ప్లేయ‌ర్ లావ‌ణ్య (లావ‌ణ్య త్రిపాఠి) ని తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె కోసం రోజూ క్లబ్ కు వెళ్తూంటాడు. ఈ క్రమంలో అక్కడ క్లబ్ కష్టాలు తెలుస్తాయి. దాంతో తను ఆ క్లబ్ ని ఒడ్డున పడేయాలనుకుంటాడు. అప్పుడు అతను అసలు ఎవరు అనేది రివీల్ అవుతుంది. అండ‌ర్ 21 జాతీయ‌స్థాయి హాకీ కెప్టెన్ అని అర్దమవుతుంది. అంత గొప్ప ఆటగాడు..  హాకీ నుంచి ఎందుకు దూరం కావాల్సి వ‌చ్చింది? అత‌ని ప్లాష్ బ్యాక్  ఏమిటి? ఇప్పుడు సందీప్ తీసుకున్న ఏ నిర్ణయం ఆ టీమ్ ని ఒడ్డున పడేస్తుంది. చివరకు ఏమైంది అనేది మిగ‌తా చిత్ర క‌థ.

స్క్రీన్ ప్లే సంగతులు

నిజానికి ఇదేమీ కొత్త కథ కాదు..మనం ఇంతకు ముందు సైలో చూసిందే, లగాన్ లో నచ్చి మెచ్చుకున్నదే. అయితే ఈ సారి హాకీ స్టిక్ పట్టుకుని హీరో రంగంలోకి దిగాడు అంతే. అలాగే స్క్రీన్ ప్లే ని పూర్తిగా స్పోర్ట్స్ సినిమాలా డిజైన్ చేయలేదు. ఫస్టాఫ్ మొత్తం లవ్ స్టోరీ, సెటప్,సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ గెలుపు కోసం ఆట. దాంతో ఈ కథ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో ఆ విషయాన్ని కవర్ చేసారు. చివరి ఇరవై నిముషాలు సినిమాకు ప్రాణంగా నిలిచింది. అయితే ఇంటర్వెల్ ముందు దాకా కథలోకి వెళ్లకపోవటం , ఇంటర్వెల్ అయ్యాక ఒకేసారి ప్లాష్ బ్యాక్ ఓపెన్ చేయటం తో స్క్రీన్ టైమ్ అసలు కథకు పెద్దగా మిగలలేదు. అలాగే ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో బాగా తక్కువ ఉంది. దానికి తోడు సందీప్ కిషన్ తో పోరాడే అవతలి ప్రత్యర్ది …తెలుసున్న వాడు కాకపోవటంతో కాంప్లిక్ట్ సరిగ్గా రైజ్ కాలేదు.రాజ‌కీయాల కార‌ణంగా  సంజు స్నేహితుడు ద‌ర్శి టోర్నీకి సెలెక్ట్ కాక‌పోవ‌డంతో సూసైడ్ చేసుకోవటం, మ‌రో ప్రెండ్ రాహుల్ రామ‌కృష్ణ కాలును కోల్పోవటం వంటివి కథని ఒడ్డుని పడేసేందుకు తోర్పడ్డాయి. ఈ  ఎపిసోడ్స్ మినహా సినిమాలో ఉద్వేగ‌భ‌రితంగా సాగేవేమీ కనపడలేదు.

టెక్నికల్ గా …

డెన్నిస్ జీవ‌న్ తమిళంలోనూ ఈయనే డైరక్షన్ చేసారు. అయినా ఎందుకో తెలుగు రీమేక్‌ను స‌రిగ్గా డీల్ చేయ‌లేద‌నిపించింది.  హిప్‌హాప్ త‌మిళ పాట‌లు ఫరవాలేదు. క్లైమాక్స్ షూట్ లో కెమెరామెన్ ప‌నిత‌నం క‌నిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి ఇద్దరూ వంకపెట్టలేని విధంగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రావు రమేష్ సెటైర్స్ బాగున్నాయి.

చూడచ్చా
మార్కెట్ లోనూ అంతకు మించిన సినిమాలు ఏమీ కనపడటం లేదు కాబట్టి ఓ లుక్ వేయచ్చు
 
తెర ముందు..వెనక

నటీనటులు : సందీప్ కిష‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌ తదితరులు
సంగీతం : హిప్‌ హాప్‌ తమిళ
ఎడిటింగ్‌:  చోటా కె. ప్ర‌సాద్‌
సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్‌
నిర్మాతలు :  టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్‌ అగర్వాల్
దర్శకత్వం : డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను
రన్ టైమ్: 2 గంటల 18 నిముషాలు
విడుదల తేది : మార్చి 05, 2021