C/o కంచరపాలెం మూవీ రివ్యూ

Published On: September 7, 2018   |   Posted By:

C/o కంచరపాలెం మూవీ రివ్యూ

టైటిల్ : C/o కంచరపాలెం
రిలీజ్ డేట్ : 07/09/2018
తారాగణం : సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌
సంగీతం : స్వీకర్‌ అగస్తీ
దర్శకత్వం : వెంకటేష్‌ మహా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి
సమర్పణ : రానా దగ్గుబాటి
సినిమాటోగ్రఫీ : వరుణ్ చపేకర్ & ఆదిత్య జువ్వాడి
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
బ్యానర్ : పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్,అసోషియేషన్ విత్ సురేష్ ప్రొడక్షన్స్

కథ:
కథగా చెబితే దీనికి అంతం ఉంటుందని నా భావన. కారణం జీవితం కనుక, ఇదీ కథ..అని చెప్పకూడదు. సరదాగా మాట్లాడుకుంటే, రాజు అనే ఒక 50 ఏళ్ళ సాధారణ అటెండర్ జీవితప్రయాణం అని చెప్పవచ్చు. కంచరపాలెం అనే ఊరు,ఆ మనుషుల మనో భావాలు అని ఇంకొ మాటలో చెప్పగలము.

ప్లస్ పాయింట్స్ :
సాధారణ మేకింగ్.
చర్చించే సన్నివేశాలున్న అధిక చర్చకు వెళ్ళకపోవడం.
సంగీతం ( రీ రికార్డింగ్ )

మైనస్ పాయింట్స్ :
రచన
డైరెక్టర్ పాత్రలని చూపించినంత బాగా, ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ:
చాలా మంది పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు ఈ c/o కంచరపాలెం సినిమా చూసి ట్విట్లు, బైట్లు ఇచ్చి ముల్టీప్లెక్స్ ఆడియన్స్ ని బానే పోగు చేశారు. అలా చేసినందుకు వెంకటేష్ మహా మరియు కంచరపాలెం ప్రజలు థాంక్స్ చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే, రాజు అనే 50 ఏళ్ళ వ్యక్తి అంతకు ముందే ప్రేమ లో రకరకాలు గా విఫవమై ఉంటాడు. అతను 50 ఏళ్ళ వయసులో ప్రేమలో పడతాడు. అతని గతం ఇది అని పతాకం లో చెప్పుకొచ్చాడు దర్శకుడు. రాజు ప్రదర్శన బాగున్నప్పటికీ, అతడి అండర్ కరెంట్ స్క్రీన్ ప్లై ని దర్శకుడు సరైన నియమావళి లో నడిపించలేకపోయాడు. ఉదాహరణకు ఇంటర్వెల్ లో ఒరిస్సా మేడం నన్ను పెళ్లి చేసుకుంటుటావా అని ఆడిగినప్పుడు పారిపోయి వచ్చేసిన రాజు, 42 ఏళ్ళ వయసులో కూడా తోడుకోసం సిన్సియర్ గా తనని లవ్ చేస్తున్న ఒరిస్సా మేడంని మొదట జనలేమనుకుంటుటారు వద్దనుకుని, తరువాత తన ముసలి ప్రెండ్స్ రెచ్చగొట్టడం తోటి పెళ్లి కి సై అనడం హాస్యం. ఈ విషయం పై దర్శకుడు కాదు కాదు సహజంగానే రూరల్ జనాల మెంటాలిటీ అలాగే ఉంటుంది,కనుకే అలా రాశాం అంటే. వినేవాడు చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి తప్ప. ఏమి చేయకూడదు. అలానే మరో విషయం లో కూడా ఇలాంటీ తప్పే జరిగిందని చెప్పవచ్చు… ఏమిటంటే, తోడుకోసం పెళ్లి చేసుకుంటున్నాను అని కూతురిని ఒప్పించే పనిగా ఒరిస్సా మేడం తో చెప్పించి, పతాకం లో శోభనం సీన్ తీయడం తో “ఓఓఓ ఇతను తెలుగు సినిమానే కదా తీశాడు” అనే కాన్షియస్ ని ప్రేక్షకులలో ఒక్క దెబ్బకి కల్పించేశాడు. పతాకం లో మిగిలిన మూడు కథలు నావే అనడం లో దర్శకుడు ప్రేక్షకుడి మనసు దోచుకున్నప్పటికీ, టైం పిరియాడికల్ గా, సుందరం,జోసెఫ్,గడ్డం లాటి పేర్ల లాజిక్ చాలా క్లియర్ గా మిస్ చేశాడు. ఒరిస్సా మేడం కూతురి క్యారెక్టర్ పండింది. దర్శకుడు ఇంకా అమాయకంగానే ఆలోచించి ఉంటే …. పాత్రల్ని గురించి రాజమౌళి గారు చెప్పినట్లు సాధారణ ప్రేక్షకుడు కూడా చాలా రోజుల పాటు ఆలోచించే వాడేమో. మిగిలిన పాత్రలు తేర పై బాగా పెర్ఫామ్ చేశాయి. సినెమాటోగ్రఫి హాయిగా ఉంది. ముక్యంగా ఇంటర్వెల్ తరువాత. దర్శకుడు తొందరపడి ప్రొడ్యూసర్ ఉన్నారు కనుక ఆలస్యం చేయకూడదని వెంటనే తీసేశాడు.. ఇంక్కాస్త పరిశోధనలు చేసి సెట్ కి వెళ్ళుంటే బాగుండునేమో అనే ఫీలింగ్ సినిమా చుసిన ఆడియన్ కి కలగక మానదు.

బోట‌మ్ లైన్‌:అలా ఒక్క సారి తిరిగొచ్చే ఊరు “కంచరపాలెం”.

రేటింగ్ : 2.75/5